బిచ్చగాడు బాహుబలిని క్రాస్ చేసినట్టే!

100 కోట్ల బడ్జెట్ తో భారీ కాస్టింగ్ తో సినిమా తీసి 150 కోట్లు కలెక్ట్ చేయడంలో కిక్కేముంది!అదే ఓ డబ్బింగ్ సినిమా,ఎవరూ పేరున్న నటులు లేరు,టెక్నిషియన్స్ అంత కన్నా లేని ఓ సాదా సీదా సినిమా తెలుగులో 25 కోట్లు కలెక్ట్ చెయ్యడం అంటేనే అది బాహుబలి కంటే పెద్ద హిట్ అయినట్టే లెక్క.ఈపాటికే అర్థం అయుంటుంది కదా..అది తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ తెలుగులో ‘బిచ్చగాడు’ అని.

మే 13న విడుదలైన బిచ్చగాడు సినిమా 63 రోజుల‌ను పూర్తి చేసుకుని దిగ్విజ‌యంగా వంద‌రోజుల వేడుక‌ను జ‌రుపుకునే దిశ‌గా వెళుతుంది.ఆంద్రాలో 10,87,33,270/-, నైజాంలో 7,35,19,804/-, సీడెడ్ లో 6,85,67,673/ రూపాయ‌ల‌తో మొత్తంగా ఇప్ప‌టికీ ఈ చిత్రం 25 కోట్ల రూపాయల‌ను క‌లెక్ట్ చేసి ట్రెండ్ క్రియేట్ చేసింది.

ఇప్పటికి ఈ సినిమా మాములు రోజుల్లో 70 శాతం కలెక్షన్స్ తో,అదే వీక్ ఎండ్స్ అయితే 100% కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది.ఈ హవా చూస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా 40 కోట్ల మార్క్ ని అందుకుంటుందని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి.కథలో దమ్ముంటే..కథనం లో విషయముంటే అది తెలుగా తమిళా అని సంబంధం లేదు,పెద్దా చిన్నా అని తేడా లేదు అని బిచ్చగాడు తో మరో సారి తెలుగు ప్రేక్షకులు నిరూపించారు.