నోవాటెల్ లో నిశితార్థం పారిస్ లో హానిమూన్!

సమంత,నాగచైతన్య కి సంబంధించి రోజూ ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది.తాజాగా ఈ జంట ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ అయిందని సెప్టెంబర్ 23 న వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని వార్త హల్చల్ చేస్తోంది.అక్కడితో ఆగకుండా వీరి ఎంగేజ్ మెంట్ కి వేదిక కూడా బుక్ చేశారని,అది నోవాటెల్ హోటల్ అని పుకార్లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయాలపై సమంత ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకి స్పందిస్తూ ఏ విషయం తేల్చకుండా చాలా తెలివిగా బదులిచ్చింది.చైతు కి మీకు సెప్టెంబర్ 23 న నోవాటెల్ లో ఎంగేజ్మెంట్ కదా అన్న ప్రశ్నకి సమంత అవునా నాకెవరు చెప్పలేదు అని బదులిచ్చింది.ఇంకో అభిమాని అయితే ఆన్లైన్ లో మీ ఇద్దరి హనీమూన్ డేట్ కూడా ఫిక్స చేసేస్తారు అని చెప్పగా,సమంతా వారికి దండం పెట్టింది.ఇంకొకరైతే ఏకంగా నా దగ్గర ట్రావెల్ కూపన్స్ వున్నాయి మీ హానిమూన్ ట్రిప్ కి ఇస్తాను అనగా.సమంత Rofl (నేలపై పడి పడి నవ్వడం) అన్న రిప్లై ఇచ్చింది.హానిమూన్ ఎక్కడనే దానిపై స్పందిస్తూ మీరే విత్తనం నాటారు కదా కూర్చొని ఎంజాయ్ చెయ్యండి,నేనయితే పారిస్ అనుకుంటున్నా మరి మీరు అని కొంటెగా బదులిచ్చింది.