నేరగాళ్ల లిస్ట్:టాప్ టెన్ లో మోడీ

అభివృద్దిలోనో,విదేశీ పర్యటనల్లోనో అనుకునేరు..కాదు కాదు ప్రపంచం లోని టాప్ 10 నేరగాళ్లలో సాక్షాత్తు భారత దేశ ప్రధానమంత్రి మోడీ వున్నట్టుగా చూపుతోంది సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.ఎవరైనా గూగుల్ లో టాప్ 10 క్రిమినల్స్ అని సెర్చ్ చేస్తే అందులో మోడీ ని చూపడం తో ‘గూగుల్‌’ సీఈఓ, సంస్థ భారత హెడ్‌కు అలహాబాద్‌ కోర్టు నోటీసు పంపింది.

ప్రపంచం లోనే టాప్ 10 క్రిమినల్స్ లో మోడీని చూపుతున్నారంటూ ఓ అడ్వకేటు ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన కోర్టు ఈ నోటీసు జారీ చేసింది.అయితే ఇదివరకే ఈ విషయానికి సంబంధించి సదరు అడ్వొకేట్ గూగుల్ కి ఓ లేఖ రాయగా..దాన్ని గూగుల్ పెద్దగా పట్టించుకోలేదన్నారు.

అయినా గూగుల్ ఎంతైనా ఇంటర్నెట్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నామనే పొగరో లేక మనం ఎం చేసినా చెల్లుబడి అవుతుందన్న గర్వమో తెలీదు.మోడీ వ్యవహారం మొదటిదేమీ కాదు.ఇలాంటి అనేక కేసులను గూగుల్ ఎప్పటినుండో ఎదుర్కొంటోంది అయినా సరే పద్దతి మారడం లేదు.