చిరు 150 కి డబ్బులొద్దు ఆ జిల్లా చాలు:వినాయక్

ఈ మధ్యన డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ బాగా పెంచేశారు.ఇక టాప్ డైరెక్టర్స్ గురించి చెప్పనక్కర్లేదు.త్రివిక్రన్ 10 నుంచి 15 కోట్లు తీసుకుందాడని టాక్.మహేష్ తో కొరటాల తీయబోయే తదుపరి సినిమాకి 15 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం.హీరోలతో పోటీ పడి మీరీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు ఈ తరం దర్శకులు.

చిరంజీవి 150 వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు మాస్ డైరెక్టర్ వినాయక్.అయితే ఈ సినిమాకి వినాయక్ ఎంత తీసుకుంటున్నాడు.ఏం ముట్టబోతోందనే దానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్లో హల్చల్ చేస్తోంది.అసలు వినాయక్ ఈ సినిమాకు డబ్బులు తీసుకోవట్లేదు.ఆశ్చర్యపోకండి. అయితే క్యాష్ కాకుండా ఈ చిత్రం తూర్పు గోదావరి రైట్స్ ను తీసుకుంటున్నాడని తెలుస్తోంది.వినాయక్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని చాగల్లు. అయినా.. ఈ ప్రాంతం హక్కులను అల్లు అరవింద్ తీసుకుంటారనే ఉద్దేశంతో ఈస్ట్ రైట్స్ తాను తీసుకుంటున్నాడట వినాయక్.అనుశ్రీ ఫిలింస్ అనే లోకల్ పంపిణీదారుడి ద్వారా ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేస్తారని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ రైట్స్ విలువ 5.5 కోట్లగా లెక్కకట్టారు. ఆ పైన ప్రాఫిట్ వస్తే అది లోకల్ డిస్ర్టిబ్యూటర్ అండ్ వినాయక్ షేర్ చేసుకుంటారట.

చిరు 150 సినిమా..అందులోను చాలా గ్యాప్ తరువాత చిరు సినిమా విపరీతమైన అంచనాలతో వస్తోంది.అదీగాక తెలుగు సినిమా మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది..ఈ లెక్కలన్నీ వేసుకుని చూస్తే వినాయక్ డీల్ చాలా రీజనబుల్ గానే అనిపిస్తోంది.చిరు సినిమాకంటే ముందు తన కుమారుడితో సినిమా చేసినందుకు నిర్మాత బెల్లంకొండ సురేష్ ఏకంగా జూబ్లీ హిల్స్ లో ఒక విల్లా ఇచ్చారు.మరి చిరు సినిమా సూపర్ హిట్ అయ్యేలా తీస్తే వినాయక్ కి ఒక విల్లా ఏమిటి ఏదయినా కొనేస్తాడు వినాయక్.చిరు స్టామినా అటువంటిది మరి.