చిరు సరసన నయనతార:హీరోయిన్ కాదు సుమీ !!

‘బాబు బంగారం’ సినిమా తర్వాత నయనతార నటించబోయే సినిమా, చిరంజీవి హీరోగా రూపొందుతున్న సినిమాయేనట. అయితే ఇందులో నయనతార హీరోయిన్‌ కాదని తెలియవస్తోంది. నయనతారను ఓ ముఖ్య పాత్ర కోసం వినాయక్‌ సంప్రదించాడట. చిరంజీవితో సినిమా అనగానే నయనతార ఓకే చెప్పేసిందట. ముందుగా నయనతార, చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించనుందని, ఆమె కోసం సంప్రదింపులు జరిగాయని టాక్‌ వినవచ్చింది. అయితే నయనతార చిరంజీవితో నటించే అవకాశాన్ని కాదనేసిందని కూడా ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదట.

ఇంకో వైపున అనుష్క కోసం కూడా వినాయక్‌ వైపు నుంచి సంప్రదింపులు జరుగుతున్నాయని వినికిడి. కానీ అనుష్క ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉంది. ఒక పక్క పెద్ద సినిమా అయిన రాజమౌళి ‘బాహుబలి 2’ మరో పక్క నాగార్జునతో ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాలలోని కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇదే కాక హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ ‘భాగ్‌మతి’ కూడా ఆమె ఖాతాలో ఉంది. ఇవన్నీ భారీ ప్రాజెక్ట్‌లే. మరి వీటన్నింటితో పాటు, చిరంజీవి సినిమా అంటే మరీ పెద్ద ప్రాజెక్టు. ఈ టైంలో అలాంటి ప్రాజెక్ట్‌ని వదులుకోలేక, ఒప్పుకోలేక సతమతమవుతోందట.

అలాగే నయనతార చేతిలో కూడా హరర్‌ అండ్‌ థ్రిల్లర్‌ సినిమాలు రెండు ఉన్నాయి. అది కాక తెలుగులో వెంకీతో ‘బాబు బంగారం’ సినిమాలు ఉన్నాయి. అయితే వీరిద్దరినీ కంపేర్‌ చేస్తే నయనతారకు ఒకింత ఛాన్స్‌ ఉంది. మరి పూర్తి హీరోయిన్‌గా ఎవరికి అవకాశం ఉంటుందో ఇంకా తెలియ రావాలి.