చినబాబుకి పెద్ద పెద్ద కష్టాలు:నవ్వొద్దు ప్లీజ్!

చంద్రబాబును… ఆయన మనవడు దేవాన్షు గుర్తు పట్టలేకపోతున్నాడని… లోకేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నవ్యాంధ్రను ఒడ్డున పడేసేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పగలు, రాత్రి లేకుండా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తన కుటుంబ సభ్యులకు కూడా సరైన సమయం కేటాయించలేకపోతున్నారని…. తెల్లవారుజామునే నిద్ర లేచి అర్థరాత్రి వరకు ఇంటికి రావట్లేదన్నారు ఈ కష్టాన్ని ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏకరువు పెట్టారు.పాపం ఇదే విషయమై నిద్రాదేవి కూడా చంద్రబాబు ఎప్పుడు పడుకుంటాడా ఆయన్ని ఎప్పుడు ఆవహిద్దామా అని రెండేళ్లుగా ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాసాయని టీడీపీ పేజీలో ఏకరువుపెట్టారు పాపం.

తన కొడుకు దేవాన్ష్ తన తండ్రిని చూసి… కొత్త వ్యక్తిని చూసినట్లు ఏడుస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మనవడిని ముద్దులాడే తీరిక కూడా లేకుండా చంద్రబాబు కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సీఎం హోదాలో సెక్రటేరియట్ కు వెళ్లిన తండ్రికి కూర్చునేందుకు కుర్చీ కూడా లేకపోయిందని కూడా లోకేశ్ చెప్పుకొచ్చారు.కన్నీటి పర్యంతం అవ్వడం ఒక్కటే ఈ ఎపిసోడ్ కి లోటుగా అనిపించింది.పాపం చినబాబుకు వచ్చిన ఈ మహా కష్టం వేరెవరికీ రాకూడని కోరుకుందాం.