అల్లరోడు ఎవరికి ఫ్యానో తెలుసా? 

తన కామెడీతో అందర్నీ అలరించే అల్లరి నరేష్‌ ఈ మధ్య పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అందుకు కారణం తాను ఎంచుకునే కథల్లో విషయం లేకపోవడమే కానీ, నాలో ఏ ప్రోబ్లమ్‌ లేదంటున్నాడు ఈ యంగ్‌ హీరో. ఈ మధ్య వచ్చిన ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమా తనకు ఎంతో బాగా నచ్చిన సినిమా అంటున్నాడు. అందులో నాని చాలా బాగా నటించాడు. అతను పండించిన కామెడీకి ఫిదా అయిపోయానంటున్నాడు. మతిమరుపు అనే చిన్న కాన్సెప్ట్‌ని తీసుకుని నాని బాగా సక్సెస్‌ అయ్యాడు. చాలా రీజనబుల్‌ కాన్సెప్ట్‌తో జనానికి బాగా కనెక్ట్‌ అయ్యాడు నాని. నాని ఈజ్‌ సో గ్రేట్‌ అని తన తోటి హీరోని తెగ పొగిడేస్తున్నాడు నరేష్‌.

అయితే అదే కాన్సెప్ట్‌ తనకి వచ్చుంటే ఇంకా బాగా నటించేవాణ్ణి. నా బ్యాడ్‌లక్‌. నాని గుడ్‌ లక్‌ అని ఫీలవుతున్నాడు కూడా ఈ అల్లరి హీరో. ప్రస్తుతం వరుస సినిమాలతో వస్తున్నాడు అల్లరి నరేష్‌. ప్రస్తుతం సెల్ఫీల హవా సాగుతున్న టైంలో ‘సెల్ఫీ రాజా’ సినిమాతో ప్రజల్ని బాగా ఆకట్టుకోగలననే నమ్మకంతో ఈ సినిమాకు సైన్‌ చేశానంటున్నాడు. ఆ తరువాత కృష్ణ భగవాన్‌ కథ బాగా నచ్చింది. ఆ సినిమాపై కూడా ఎక్కువే అంచనాలున్నాయి అంటున్నాడు. ఇవే కాక ఇంత వరకూ తాను టచ్‌ చేయని సబ్జెక్ట్‌, హారర్‌ కామెడీతో జి.నాగేశ్వర్‌ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాతో రాబోతున్నాడు ఈ కామెడీ హీరో. వీటిలో ఏ ఒక్కటి హిట్‌ టాక్‌ సంపాదించినా, ఇదివరకటిలా మళ్లీ చెలరేగిపోతానంటున్నాడు.