అతిలోక సుందరి అద్భుతహ

‘జగదేకవీరుని కథ’ పేరుతో అల్లు శిరీష్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. తొలి సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ ఈ హీరోయిన్‌కి మంచి గుర్తింపునిచ్చినా వరుసగా అవకాశాలు దక్కించుకోవడంలో కొంచెం వెనకబడిందీ భామ. అందం, అందానికి తోడు నటన ఈమె ప్రత్యేకతలు. ఈ భామ కళ్యాణ్‌రామ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కొన్ని కారణాలతో ఆ సినిమా వర్కవుట్‌ కాలేదు.

మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్‌ సరసన నటిస్తూ, మెగా కాంపౌండ్‌ హీరోయిన్‌ అనే గుర్తింపు సంపాదించుకోబోతోంది ఈ బ్యూటీ. అదే ‘జగదేక వీరుని కథ’. ఈ సినిమాలో హీరోయిన్‌గా మెహరీన్‌కౌర్‌కి ఛాన్సొచ్చింది. చిరంజీవి హీరోగా వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో శ్రీదేవి ఎంత అందంగా కనిపించిందో తెలుసు కదా. అంతటి అందమైన పాత్రని ‘జగదేకవీరుని కథ’ సినిమాలో మెహరీన్‌కి దక్కనుందట. అయితే ఇది సోషియో ఫాంటసీ సినిమా కాదు. ఇది చారిత్రక నేపథ్యమున్న కథ అట. అదేంటో ఇప్పటికైతే సస్పెన్స్‌. ఇదొక్కటే కాదు, మెగా ఫ్యామిలీ మెహరీన్‌కి వరుస అవకాశాలు రానున్నాయని సమాచారమ్‌.

తెలుగులో గలగలా మాట్లాడేయాలని ఉందని చెబుతున్న ఈ భామ కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుంటోందట. బాగా మాట్లాడేయగలిగినప్పుడు డబ్బింగ్‌ కూడా చెప్పుకుంటానంటోంది మెహరీన్‌. ఏదేమైనా జగదేక వీరుని కథ అనగానే అందరికీ అతిలోక సుందరి గుర్తుకొచ్చింది. అంతటి పేరున్న పాత్రలో ఈ అందాలభామ ఎలా రాణిస్తుందో చూడాలిక.