సిద్దూ: బిపాషా బసుతోనా యోగా- హవ్వ

కన్నడ సీఎం… ఏ విషయంలోనూ ఎక్కడా తగ్గరు…అది కారైనా కావచ్చు…  చేతి వాచ్ అయినా కావొచ్చు… కాంట్రావర్శీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే సిద్ధప్ప మరో వివాదానికి తెరతీశారు…  ఏకంగా బెంగుళూరులో జరిగిన యోగాడేలో బిపాసా కోసం కోటిన్నర ఖర్చఉ చేశారట… ఇటీవలే కేంద్ర ప్రభుత్వం యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించింది వివిధ రాష్ట్రాల్లో ఈ యోగా కార్యక్రమాలు జరిగాయి. ఇక యోగాలో పలువురు సీఎంలు..తారలు..అధికారులు పాల్గొన్నారు.

కర్నాటకలో నిర్వహించిన యోగాపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ నిర్వహించిన యోగా శిబిరంలో బాలీవుడ్ నటి బిపాస బసు పాల్గొంది. గంటన్నర పాటు యోగా జరిగింది. కానీ సిద్ధ రామయ్య ప్రభుత్వం యోగా చేసినందుకు బిపాసకు కోటిన్నర రూపాయలు చెల్లించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముంబై నుంచి ఆమె బెంగుళూరుకు రాకపోకలు..బెంగుళూరులో ఆమె బస కోసం…ఇలా డబ్బును వెదజల్లారని కథనాలు వెలువడుతున్నాయి. బిపాస బసు కాకుండా ఇతర నటీమణిలను పిలిస్తే బాగుండేదనని అనే సెటైర్స్ విసురుతున్నారంట.