వీళ్ళు పోలీసులా సిగ్గు సిగ్గు!!

యూపీలో దొంగలు.. రౌడీలే కాదు. పోలీసులు కూడా రెచ్చిపోతున్నారు. వారికి వారే వీధి రౌడీల్లా దర్శనం ఇస్తున్నారు. వాటాలు పంచుకునేందుకు తొలుత చర్చను ప్రారంభించి పొరపొచ్చాలు రావడంతో తన్నుకున్నారు.చుట్టూ అందరు చూస్తున్నారనే సోయి కూడా మరిచి పట్టపగలు తన్నుకున్నారు. లంచాలు పంచుకునే విషయంలోనే ఈ ఘర్షణకు వారు దిగారు. రోడ్డుపైనే పరస్పరం వారు తలపడ్డారు. ఈ సంఘటనపట్ల సామాన్య జనం విస్తుపోతుండగా ఉన్నత పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.