రాజకీయ నాయకులూ ప్రేమలో పడతారు..

ప్రేమకు హోదా..దర్పం ఇంకా..ఏమైనా ఉంటాయా ? ఉండవు..తొలి చూపులోనే ఎంతో మంది ప్రేమలో పడుతుంటారు. ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఇలాగే మోడీ కేబినెట్ లోని మంత్రి ప్రేమలో పడిపోయారు. ఎయిర్ హోస్టెస్ రచన శర్మ చూపుకు కేంద్ర మంత్రి బాబుల్ సుప్రీయో పడిపోయారు. వీరి మధ్య ప్రేమ చిగురించింది. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆగస్టు 9వ తేదీన వీరి వివాహం జరగబోతోందని తెలుస్తోంది.

అసలు వీరి ప్రేమ ఎలా చిగురించింది అనే దానిపై మంత్రి సుప్రీయో వివరణనిచ్చారు. యోగా గురువు రాందేవ్ బాబాతో కలిసి విమాన ప్రయాణం చేయడం జరిగిందని, తన ఎంపీ సీటు అభ్యర్థిత్వం కోసం చర్చించడం జరుగుతోందని తెలిపారు. సీటు వస్తే తప్పకుండా గెలుస్తారని ఎయిర్ హోస్టెస్ రచన పేర్కొన్నారని, అలా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిపోయిందన్నారు.