మళ్లీ తెరాస గూటికి లేడీ బాస్ విజయశాంతి!!

ఒకప్పటి వెండితెర అందాల రాశి,లేడీ బాస్ విజయశాంతి కొన్నాళ్లుగా రాజకీయ స్థాబ్దతతో వున్నారు.తెలంగాణా ఉద్యమంలో తెరాస తో నడిచి మెదక్ MP గా తెరాస తరపున పోటీచేసి గెలుపొంది తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యే చివరి రోజుల్లో కాంగ్రెస్ లో చేరి తన రాజకీయ మనుగడనే ప్రశ్నార్థకం చేసుకున్నారు.

తెరాస లో వున్నన్ని రోజులు ఒక వెలుగు వెలిగింది విజయశాంతి.పెద్దగా మహిళా ప్రాదాన్యత లేని తెరాస పార్టీ లో విజయశాంతి ఆలోటును తీరుస్తూ ఒకానొక టైం లో No 2 ఆమే అన్నంతగా దూసుకుపోయింది.తాజాగా నల్గొండ కాంగ్రెస్ నాయకులు తెరాస చేరిక సందర్భంగా కెసిఆర్ ఒక్కప్పటి విజయశాంతి కాంగ్రెస్ లో చేరిక గురించి ప్రస్తావిస్తూ వాళ్ళు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా అని ఘాటుగా విమర్శించారు.దీనిపై విజయశాంతి తాజాగా ఓ పత్రికా ప్రకటనని విడుదల చేసారు.

సాధారణంగా అయితే విజయశాంతి కాలిబర్ కి ఏ ప్రెస్ మీటో పెట్టి ఎడా పెడా కెసిఆర్ పైన ఎదురు దాడి చెయ్యాలి.ఎందుకంటే కెసిఆర్ చెప్పినట్టు విజయశాంతి తెరాసలో వుంటూ కాంగ్రెస్ లో చేరలేదు.తెరాస పార్టీ తనని సస్పెండ్ చేసాకే కాంగ్రెస్ లో చేరింది అన్న బలమైన అంశం తనదగ్గరున్నా కూడా కేవలం ఓ పత్రికా ప్రకటనతో సరిపెట్టేసింది.ఆ ప్రకటన సస్పెన్షన్ వివరణతో ఆగకుండా కుట్రలు, అబద్ధపు సమాచారంతో తనను టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారన్నారు.అంటే అధినేత కెసిఆర్ కి తప్పుడు సామాచారం ఇచ్చి వుద్దేసపుర్వకంగా ఓ వర్గం తనపై కుట్రలు చేసి పార్టీ నుండి సస్పెండ్ చేసిందని విజయశాంతి వాపోయింది.అంతటితో ఆగకుండా సుదీర్ఘకాలం ఉద్యమంలో పనిచేసిన నాయకులుగా తాను, కేసీఆర్ పరస్పరం ఎంతో గౌరవించుకున్నామన్నారు.ఈ మొతం వ్యవహారం లో విజయశాంతి తిరిగి తెరాస లో చేరేందుకు ప్రయత్నిస్తోందని అందుకే కెసిఆర్ ని విమర్శించకుండా వ్యుహాత్మాకంగా పత్రికా ప్రకటన విడులచేసి కెసిఆర్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని ప్రస్తావించిందని రాజీక విశ్లేషకులు భావిస్తున్నారు.