పులిచింతల పంచాయితీ షురూ

విడిపోయినా అన్నదమ్ములుగానే కలిసుందాం అన్నది ఒట్టి మాటే..లోలోపల రెండు తెలుగు రాష్ట్రాలు జల జగడాలతో సతమతమౌతున్నాయి.తెలాంగాణా వాటాలో చుక్కనీరు కూడా మాకు అవసరంలేదు అని ఆంద్రప్రదేశ్ చెప్తోంటే మాకు రావాల్సిన వాటాకు మించి మేము ఒక్క చుక్క నీటి బొట్టును కూడా తీసుకొం అని తెలంగాణా వాదిస్తోంది.మరి సమస్యేంటా అనుకుంటున్నారా,అదేనండి ఈగో అండి ఈగో..మేమెందుకు ఒప్పుకోవాలి..మేమెందుకు దిగిరావాలి..కుదిరిన కాడికి సమస్యస్యల్ని జటిలం చేసేసి ఎవరికి వారు హీరోలమైపోదామనే తప్ప రాష్ట్ర ప్రయోజానాగురించి ఆలోచించేదెవరు?ప్రజలమధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టేద్దాం పబ్బం గడిపేసుకుందాం అనే తప్ప సమస్యల్ని పరిష్కారం చేసే ఉద్దేశం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ లేదన్నది నిర్వివాదాంశం.

అసలే కృష్ణ జలాల పంపకం అని,నాగార్జున సాగర్ గేట్లని రాక రకాల వివాదాలు సృష్టించేశాయి రెండు రాష్ట్ర పాలకులు ఇప్పుడు దానికి అదనంగా తెలంగాణ ప్రభుత్వం పులిచింతల మెలిక పెట్టింది. ఓ వైపు కృష్ణాజలాల పంపిణీపై ఏకాభిప్రాయం కుదరక పోవడంతో తెలంగాణ, ఏపీల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండగా మరో వైపు పులిచింతల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగకుండా అడ్డకాలు వేసింది. పులిచింతల కింద ముంపునకు గురైన ప్రజలకు సహాయ, పునరావాస కార్యక్రమాలు పూర్తి ఇంకా పూర్తి కాలేదు. పులిచింతల నిర్మాణంతో ముంపుకు గురౌతున్న తెలంగాణలోని నల్గొండ ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి చేసిన తర్వాతనే ప్రాజెక్టులో నీళ్లు నింపుకోవాలంటూ తెలంగాణ ఇరిగేషన్‌శాఖ అధికారులు ఏపీ ప్రభుత్వానికి తాజాగా లేఖ రాశారు. 45 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు కింద నల్గొండ జిల్లాలోని 13 గ్రామాలు మంపునకు గురవుతున్నాయి. పరిహారం చెల్లించే పనులలో వేగం పెంచాలంటూ ఇది వరకు తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీ ప్రభుత్వం స్పందించలేదు. డాక్టర్ కె.ఎల్. సాగర్ ప్రాజెక్టు, పులిచింతల ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి కానంతత వరకు పులిచితం ఈ యేడాది పూర్తి సామర్థ్యంతో నీటిని నింపేందుకు అనుమతించడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం నిస్సహాయతను వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇరిగేషన్‌శాఖ అధికారులు ఏపీ ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధి కారులకు లేఖ ద్వారా తమ నిర్ణయాన్ని స్పష్టం చేశారు.

సృష్టిస్తే పూటకో సమస్య పుట్టుకొస్తుంది.ఇలా మనలో మనం నిత్యం కొట్టుకుంటుంటే పైనున్న మహారాష్ట్ర కర్ణాటకలకి మనపై మనమే చిన్న చూపు కలిగించడం తప్ప మరో ప్రయోజనం ఉండదు.కలిసి పై రాష్టాలతో పోరాడి మన వాటా నీటిని మనం సాధించుకోవాలి గాని ఇలా ఎవరి మైలేజి వాళ్ళు చూసుకుంటే మొత్తం తెలుగు ప్రజలను నట్టేట ముంచడం ఎవేరికి అంత శ్రేయస్కరం కాదు.ఈ విషయం మన పాలకులకి ఎప్పటికి తెలుస్తుందో!!