నాని బ్యాక్‌ గ్రౌండ్‌ పెద్దదే!!

నాని అంటే ఇప్పుడు తెలీని వారు లేరు. చిన్నపిల్లల్ని, పెద్ద వాళ్లనీ, అన్ని రకాల వర్గాల వారిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు నాని. ‘ఈగ’ సినిమాలో నాని నటించిన సీన్లు చాలా తక్కువే అయినప్పటికీ ఆ కొద్ది టైంలోనే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు వరుస హిట్లతో హ్యాట్రిక్‌ హీరో అయిపోయాడు. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో వచ్చిన నాని తాజా సినిమా ‘జెంటిల్‌మెన్‌’ సూపర్‌ హిట్‌ అయ్యింది. సహజ నటుడిగా పేరున్న నానికి ఈ సినిమాతో మరింత పేరొచ్చింది. ఇండస్ట్రీలో ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి, ఈ స్థాయికి ఎదిగిన హీరో నాని. అయితే తన ప్రతీ సినిమాను జయాపజయాలతో సంబంధం లేకుండా ఆదరించిన ప్రేక్షకులే నాకున్న పెద్ద బ్యాగ్రౌండ్‌ అంటున్నాడు నాని.

బ్యాక్‌ గ్రౌండ్‌ లేని హీరో అంటే ఒప్పుకోడంట. తన వెనక ప్రేక్షకులు అనే పెద్ద బ్యాక్‌ గ్రౌండ్‌ ఉందంటున్నాడు. అబ్బో నాని మంచి నటుడే కాదు మాటకారి కూడా. అంతే కాదు మరో మంచి లక్షణం ఈ కుర్రహీరోలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం. అదే ఆయన్ను స్టార్‌ని చేస్తోంది. యంగ్‌ హీరోల్లో నెంబర్‌వన్‌ హీరోగా దూసుకెళ్లేలా చేస్తోంది. విలక్షణ కథల్ని ఎంచుకుంటూ నటుడిగా ఒక్కో మెట్టూ పైకెక్కుతున్నాడు నాని. నేటి తరం హీరోల్లో ఇంత మంచి లక్షణాలున్న వ్యక్తి నాని ఒక్కడే అంటే అని చెప్పడం నిస్సందేహం. ఇదే కాన్ఫిడెన్స్‌తో నాని మరింత ముందుకెళ్లాలనీ, మరిన్ని విజయాలు అందుకోవాలనీ ఆశిద్దాం. ఆల్‌ ది బెస్ట్‌ నాని.