నాగార్జున టైటిల్‌ నానికి?

చాలాకాలం క్రితం ‘మజ్ను’గా నాగార్జున అలరించారు. అప్పట్లో నటుడిగా ఆయనకు మంచిపేరు తెచ్చిందీ సినిమా.
నాగచైతన్య ‘ప్రేమమ్’కు ముందు ‘మజ్ను’ అనే టైటిల్ ను పెడదామని అనుకున్నారు. కానీ ‘ప్రేమమ్’నే ఫైనల్ చేశారు. ఇప్పుడు ఈ టైటిల్ ను నాని సినిమాకి సెట్ చేద్దామని అనుకుంటున్నట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం.
నాని హీరోగా దర్శకుడు విరించి వర్మ ఒక సినిమా చేస్తున్నాడు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ. కథాపరంగా ‘మజ్ను’ అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. ఈ సినిమాలో నాని కాసేపు అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపించనున్నాడు. ఒక సీన్ లో రాజమౌళి సినిమాలో పనిచేస్తున్నట్టుగానూ కనిపిస్తాడట. ఈ సినిమాకు ‘మజ్ను’నే ఖరారు చేస్తారో లేక కొత్త టైటిల్‌ను ఆశ్రయిస్తారో చూడాలి.