జానారెడ్డి దిమ్మతిరిగే స్కెచ్!!

జానారెడ్డి ఉన్నట్టుండి… పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మరీ… సీఎల్పీ కి రిజైన్ చేస్తానడడం వెనుక పెద్ద స్టోరీయే ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టి ఆర్ ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతొ టిడిపి, కాంగ్రెస్ నాయకులను తనలో కలిపేసుకుంది. ఇక ఇప్పుడు గులాబీ గురి జానారెడ్డి పై నే అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో రాలేనని చెప్పిన జానా… తన కొడుకు విషయంలో ఒక క్లారిటీకి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు గులాబీ పెద్దల నుంచి హామీ కూడా పొందారని చెబుతున్నారు.

ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నాయకులు టి ఆర్ ఎస్ లో చేరిపోగా మరి కొంత మంది క్యూ లో ఉన్నారు. ఈ క్రమం లో టి ఆర్ ఎస్ పార్టీ చివరి అస్త్రం గా జానారెడ్డి తనయుడు రఘుని టిఆర్ఎస్ లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందని సమాచారం. తద్వారా జానారెడ్డి తనయుడి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే పార్టీ లో ఫిరాయిం పులపై , తన పై జరుగుతున్న ప్రచారం పై జానా రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను సి ఎల్ పి సహా కాంగ్రెస్ పార్టీ కి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తానని దిగ్విజయ్ కు వర్తమానం పంపించారు. దీనితో జానారెడ్డి కి హై కమాండ్ నుండి బుజ్జగింపులు కూడా జరిగినట్లు తెలుస్తుంది