‘జనతా గ్యారేజ్’లో ఆమె ఉందట!!

కోలీవుడ్-టాలీవుడ్ ల్లో ప్రతిభావనిగా గుర్తింపు తెచ్చుకుంది దేవయాని. అప్పట్లో టాప్ హీరోలతో పాటూ యువ హీరోలతోనూ జోడీకట్టి అలరించింది. ఇలాంటి టాలెంటెడ్ యాక్టర్ సినిమాలకు స్వస్తి చెప్పి ఓ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చాయి.ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సరసన సుస్వాగతం సినిమాలో నటించి మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాక మళ్ళీ అంతటి సినిమా ఆమెకి దొరకలేదు.ఏదో అడపా దడపా సినిమాల్లో కనిపించింది అంతే.

ఇదిలా ఉంటే, మూవీలకు దూరంగా ఉన్న దేవయానిని మళ్లీ నటింపజేయడానికి కొరటాల శివ యత్నించారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ‘జనతా గ్యారేజ్’లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ‘దేవయాని’ని తీసుకున్నారని అన్నారు. ఆ తరువాత ఆమెను ఆ పాత్ర నుంచి తప్పించారనే వార్తలొచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం దేవయాని ఈ ప్రాజెక్ట్ లో కొనసాగుతోంది. ఏ పాత్ర కోసమైతే ఆమెను తీసుకున్నారో, ఆ పాత్రలో నటిస్తోందని వినికిడి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకి చేరుకుంది. ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఆగస్టు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.