సమంత పెళ్లి ఎవరితో..?

మళ్లీ మరోసారి ఈ మధ్యన పాత వార్త కొత్తగా చక్కర్లు కొడుతోంది. సమంత తరచు ఏదో విధంగా తన ప్రేమ, జోడీల వ్యవహారం ముచ్చటిస్తోంటే, హూ..ఈజ్ హి..అన్న టాక్ మొదలైంది. అయితే మరోపక్క సమంత లవర్ కావచ్చు..ఆమెను పెళ్లి చేసుకోబోయేది కావచ్చు..టాలీవుడ్ హీరోనే అన్న టాక్ మరోసారి చక్కర్లు కొట్టడం ప్రారంభించింది.

ఎలోన్ బ్యాచులర్ గా ఫ్లాట్ లో పేరెంట్స్ కు దూరంగా వుండే ఈ హీరోకి ఈ విషయంలో క్లారిటీ వచ్చేసిందని టాక్. ఈ మేరకు ఇరు ఇళ్లల్లో డిస్కషన్లు, ఒప్పించడాలు పూర్తయిపోయాయన్నది లేటెస్ట్ బజ్. దాంతో వచ్చే ఏడాది పెళ్లికి మార్గం సుగమం అయిందని ఫిలిం నగర్ సర్కిళ్లలో గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి.

చాన్నాళ్ల క్రితం ఇదే హీరోకి మరో హీరోయిన్ తో పెళ్లన్న వార్తలు గుప్పుమన్నాయి. కానీ అవి అలా అలా సద్దుమణిగాయి. కానీ సమంతతో మాత్రం బలమైన బంధం వుందన్నది చిరకాలంగా వినిపిస్తూనే వుంది. ఇప్పుడు ఒక్కసారిగా మళ్లీ మరోసారి బయటకు వచ్చి బలంగా వినిపించడం ప్రారంభించాయి.