హీరోయిన్‌తో ఘాటు లిప్‌కిస్‌పై ర‌వితేజ రియాక్ష‌న్ ఇదే..!

ఇప్పుడు సినిమాల్లో లిప్ కిస్‌లు అనేవి కామ‌న్ అయిపోయాయి. కొంద‌రు హీరోయిన్ల‌కు లిప్‌కిస్‌లు కామ‌న్‌. వారు అడిగిందే త‌డ‌వు లిప్‌కిస్‌లు ఇచ్చేందుకు సై అంటారు. మ‌రి కొంద‌రు మాత్రం లిప్‌కిస్‌లు ఇచ్చేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌రు. కానీ ద‌శాబ్దాలుగా కెరీర్ కొన‌సాగిస్తూ.. ఇప్ప‌టి వ‌ర‌కు లిప్‌కిస్‌ల‌కు దూరంగా ఉన్న మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ ఇప్పుడు ముద్దు సీన్‌లో న‌టించాడు అంటే అది ఖ‌చ్చితంగా ఇంట్ర‌స్టింగ్ న్యూసే అవుతుంది.

గ‌త మూడు నాలుగు రోజులుగా ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ర‌వితేజ తాజా సినిమా ఖిలాడి. ఈ సినిమాలో ర‌వితేజ ఫ‌స్ట్ టైం ఓ లిప్ కిస్ సీన్లో న‌టించాడు. ఈ సినిమాలో ఈ సీన్ బాగా వైర‌ల్ అవ్వడంతో ర‌వితేజ స్పందించ‌క త‌ప్ప‌లేదు. తాను ప్రొఫెష‌న‌ల్ న‌టుడిని అని.. ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని.. క్యారెక్ట‌ర్‌ను బ‌ట్టి తాను సినిమా చేసుకుంటూ వెళ్లిపోతాను అని.. లిప్‌లాక్ అనేది ప్రోఫెస‌న్‌లో భాగ‌మే అని.. ఆ సీన్ ఎందుకు చేశాను ? ఎవ‌రితో చేశాను ? అన్న‌ది వెండితెర‌పై చూసి మాత్ర‌మే ఆనందించాల‌ని చాలా సింపుల్‌గా చెప్పాడు.

ఖిలాడిలో ర‌వితేజ మూతి ముద్దు పెట్ట‌డం వెన‌క సీన్ డిమాండ్ చేయ‌డ‌మే అస‌లు కార‌ణం అని చెప్ప‌క‌నే చెప్పాడు ర‌వితేజ‌. ఖిలాడీ మూవీలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి అనే ఇద్దరు ముద్దుగుమ్మలతో కలిసి
రొమాన్స్ చేశాడు. ఇక వీళ్ల‌కు త‌న ఇంటి భోజ‌నం కూడా ర‌వితేజ రుచి చూపించాడ‌ట‌. త‌న హోం ఫుడ్‌ను ఈ ఇద్ద‌రు హీరోయిన్లు బాగా ఎంజాయ్ చేశార‌ని.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ హీరోయిన్ల‌తో క‌లిసి లంచ్ చేసేలా షెడ్యూల్స్ ప‌డ‌లేద‌ని రవితేజ చెప్పాడు.


Leave a Reply

*