గంటా శ్రీనివాసరావు.. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ కనిపించే నాయకుడు.. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో, నిన్న టీడీపీ గవర్నమెంటులో అధికారం చెలాయించిన వ్యక్తి. ఏ పార్టీకి అధికారం వస్తుందనే విషయాన్ని ముందుగానే అంచనా వేసి వ్యూహాత్మకంగా ఆ పార్టీ కండువా కప్పుకునే అలవాటున్న వ్యక్తి అని పొలిటికల్ సర్కిళ్లలో పేరున్న మనిషి. అయితే 2019లో ఆయన అంచనాలు తప్పాయి. తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైపోయింది. దీంతో రెండేళ్లుగా ఆయన మౌనం వహించారు. ప్రజల్లో‍్ల కూడా పెద్దగా లేరు. […]