ఎలా వెళ్లారో.. అలా వచ్చారు..

తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి.. వరి ధాన్యాన్ని కొనేంతవరకు మేము ఢిల్లీ వదలి రాం.. కేసీఆర్‌ ఆదేశాల మేరకు రైతుల కోసం పోరాడతాం అని ప్రగల్భాలు పలికిన టీఆర్‌ఎస్‌ మంత్రుల బృందం హస్తిన నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌.. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆమేరకు పార్టీ నిరసన చేపట్టింది. అంతేకాక మరో అడుగు ముందుకేసిన సీఎం.. […]

తుమ్మలకు జగదీష్ రెడ్డికి ఎక్కడ చెడింది

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితులైన ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య కోల్డ్ వార్ తార‌స్థాయికి చేరింది. ముఖ్యంగా తెదేపా నుంచి టీఆర్ఎస్‌లో చేర కేసీఆర్ మ‌న్న‌న‌లు పొందుతున్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు, కేసీఆర్ వెన్నంటే న‌డుస్తూ ఉన్న జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డికీ మ‌ధ్య ఆధిప‌త్య పోరు తీవ్ర‌మ‌యింది. త‌న‌కు ప్రాధాన్యం త‌గ్గిస్తూ.. తుమ్మ‌ల‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నందుకు, త‌న జిల్లా వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకుంటున్నా కేసీఆర్ ప‌ట్టించుకోక‌పోవ‌డంపై జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం అవుతున‌నారు. ఇప్పుడు డీసీసీబీ చైర్మ‌న్ […]