పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మొదటి సారి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్రమే `భీమ్లా నాయక్`. మలయాళంలో విజయ వంతమైన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివికమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్‌లు నటిస్తున్నారు. […]