ప్రకాశం ఫిరాయింపులు – ఆ ఇద్దరికీ సవాలే

రాజకీయ, ఆర్ధిక రంగాల్లో బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో అధికార-ప్రతిపక్ష పార్టీల్లో ముఠాల ముసలం మొదలయింది. తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలో ముఠా రాజకీయాలు అధినాయకత్వాలకు తలనొప్పిగా మారాయి. వారిని నియంత్రించలేని పరిస్థితి అధినేతలకు ఎదురవుతోంది.ఇటీవలి కాలంలో వైసీపీ నుంచి చేరిన గొట్టిపాటి రవి (అద్దంకి), అశోక్‌రెడ్డి (గిద్దలూరు), పాలపర్తి డేవిడ్‌రాజు (యరగొండపాలెం), పోతుల రామారావు (కందుకూరు)కు, వారి నియోజకవర్గాల్లో పాత కాలం నుంచి టిడిపిలో పనిచేస్తున్న ఇన్‌చార్జ్‌లు, మండల నేతలకు మధ్య సంఘర్షణ వాతావరణం ఏర్పడింది. అద్దంకి ఎమ్మెల్యే […]