అనంత‌పురంలో తీవ్ర విషాదం.. ఆక్సిజ‌న్ అంద‌క‌..

కొవిడ్ సెకండ్ వేవ్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. ఊపిరాడ‌నివ్వ‌డం లేదు. రెండో ద‌ఫాలో చాలా మంది శ్వాస‌కోశ సంబంధిత ఇబ్బందుల‌తో, ముఖ్యంగా ఆక్సిజ‌న్ అంద‌క‌నే ప్రాణాల‌ను కోల్పోతుండ‌డం విచార‌క‌రం. ఇప్ప‌టికే ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌, ఒడిశా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ త‌దిత‌ర రాష్ట్రాల్లో ప‌దుల సంఖ్య‌లో కొవిడ్ బాధితులు ప్రాణాల‌ను కోల్పోయారు. ఇప్ప‌టికే అనేక వైద్య‌శాల‌ల్లో ఆక్సిజ‌న్ కొర‌త నెల‌కొన్న‌ది. కేంద్రం సైతం ఆగ‌మేఘాల మీద ఆయా రాష్ట్రాల‌కు ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. అయిన‌ప్ప‌టికీ స‌కాలంలో ఆక్సిజ‌న్ అంద‌క రోగులు విగ‌త‌జీవులుగా మారుతున్నారు. […]

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ కీల‌క నిర్ణ‌యం యుద్ధ విమానాల్లో..

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రాణవాయువు (ఆక్సిజన్) కొరతతో దేశవ్యాప్తంగా వైద్య‌శాల‌ల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్ల బాధలు చెప్పలేనివి కావు. మునుపెన్నడూ చూడని విధంగా దేశంలో రోజుకు 1500 కు మించి మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో కొద్దిరోజులుగా ఈ తరహా మరణాలు పెరుగుతున్న తరుణంలో ఆక్సిజన్‌కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి టన్నుల కొద్దీ వాయువును ఆస్పత్రులకు తరలిస్తున్నా అదీ సరిపోవడం లేదు. యుద్ధ‌ప్రాతిప‌దిక ఆక్సిజ‌న్ త‌ర‌లింపున‌కు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. అందులో […]

ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ లీకై 22 మంది రోగులు మృతి..!

ఒక‌వైపు దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. వేలాది మంది ప్రాణాల‌ను బ‌లిగొంటున్న‌ది. అదేవిధంగా తీవ్ర ఆక్సిజ‌న్ కొర‌త నెల‌కొన్న నేప‌థ్యంలోనూ ప‌లువురు మృత్యువాత ప‌డుతున్నారు. ఇప్ప‌టిక ఆక్సిజ‌న్‌ను పొదుపుగా వాడాల‌ని ప్ర‌భుత్వం, అధికారులు వైద్య‌శాల‌లు, సిబ్బందికి సూచిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆ దిశ‌గా వైద్య‌సిబ్బంది దృష్టి సారించిన‌ట్లు క‌న‌బ‌డ‌డం లేదు. మహారాష్ట్ర నాసిక్ లోని ప్రముఖ జాకీర్ హుస్సేన్ వైద్య‌శాల‌లో ఆక్సిజ‌న్ ట్యాంక్ లీకై ఏకంగా 22 మంది రోగులు మృత్యువాత ప‌డ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్న‌ది. చ‌ర్చ‌నీయాంశంగా […]