పునర్విభజన ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఆంధ్రా ప్రాంత ఎంపీలంతా తహతహలాడుతున్నారు. ఏపీకి రావాల్సిన వాటి విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం మాటెలా ఉన్నా.. ఈ పునర్విభజన గురించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో తెగ చర్చలు జరుపుతున్నారట. ఆయన్ను కలిసిన ప్రతిసారీ.. ఈ అంశం గురించి అడుగుతున్నారట. టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి మరో అడుగు ముందుకేసి.. మరో నెలరోజుల్లోనే పునర్విభజన ఉంటుందని ప్రకటించేశారు. అయితే తెలుగు ఎంపీల దూకుడుకు ఏపీ బీజేపీ నేత హరిబాబు బ్రేక్ వేశారు. […]