తెలంగాణలో మొన్నటివరకు బిజేపి చాలా బలమైన పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. పలు విజయాలు దక్కించుకుని బిజేపి సత్తా చాటి..అధికార బిఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా రాజకీయం చేసింది. కానీ ఒక్కసారిగా బిజేపిలో మార్పులు, అధ్యక్షుడుని మార్చడంతో సీన్ మారిపోయింది. బిజేపి రేసులో వెనుకబడింది. ఇప్పుడు కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ల మధ్యే పోరు నడుస్తోంది. ఇలా బిజేపి వెనుకబడిన నేపథ్యంలో పార్టీకి మైలేజ్ పెంచడానికి కేంద్రం పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో లిక్కర్ స్కామ్ లో వేగంగా పావులు కదుపుతున్నారని […]