పోక చెక్కతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నే రెండంటా.,. అనేది ప్రాచుర్యంలో ఉన్న సామెత! అచ్చు ఇప్పుడు ఈ సామెతనే ఒంట బట్టించుకున్నా తెలంగాణ సీఎం కేసీఆర్. రెండు రోజుల కిందట తెలంగాణలో పర్యటించిన బీజేపీ సారధి అమిత్ షా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా ఆయన పాలనపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లక్ష కోట్లకు పైగా ఇచ్చామని, అనేక పథకాలు అమలు చేస్తున్నామని, అయినా ఎక్కడా రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని అన్నారు. నిజానికి తెలంగాణపై ఎవరు ఏ […]
Tag: KCR
ఓటుకు నోటు కేసు భయం బాబుని ఇంకా వెంటాడుతోందా?
ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి చాలా భిన్నంగా మారింది. ఆయన తనను తాను అలెగ్జాండర్‌తో పోల్చుకుంటారు. తానెవరికీ భయపడడని, అవినీతికి తన దగ్గర తావు లేదని పదే పదే చెబుతుంటారు. అయితే, నిన్న బుధవారం జరిగిన ఓ సంఘటన మాత్రం బాబు పిరికి వాడనే కామెంట్లు రావడానికి అవకాశం కల్పించింది. అదేంటో మీరూ చదవండి! ప్రస్తుతం టీడీపీలో మహానాడు ఫీవర్ కొనసాగుతోంది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు మహానాడు పెద్ద ఎత్తున జరగనుంది. […]
టీడీపీ, టీఆర్ఎస్‌ను తొక్కేందుకు బీజేపీ కొత్త స్కెచ్
రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణలో ఒంటరిగా ఎదిగేందుకు బీజేపీ ఎంత దారుణమైన రాజకీయానికి అయినా తెరలేపేలా ఉంది. ఏపీలో అధికార టీడీపీతో మిత్రపక్షంగా ఉన్నా మరోవైపు టీడీపీని వీలున్నంత వరకు తొక్కే ఛాన్స్‌లు ఉన్నా వాటిని ఏ మాత్రం వదులుకోవడం లేదు. అటు తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌తో వీలుంటే పొత్తు లేకుండా లేదా ఏదోలా టీఆర్ఎస్‌ను అణగదొక్కడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల అధినేతలు, రెండు రాష్ట్రాల సీఎంలు […]
కేసీఆర్ సర్వేలో బీజేపీకి వచ్చే సీట్లు ఇవే…
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా తెలంగాణ పర్యటన అధికార టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నాయకుల మధ్య మాటల మంటను పుట్టిస్తోంది. అమిత్ షా సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌గా చేస్తూ భారీ విమర్శలు చేశారు. కేంద్రం తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు….అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో కేసీఆర్ అమిత్ షా వ్యాఖ్యలపై ఆయన ఇక్కడ ఉండగానే ప్రెస్‌మీట్ కౌంటర్ ఇచ్చారు. అమిత్ షాకు దళితులపై […]
కేసీఆర్ ముందు అమిత్ షా కుప్పిగంతులా..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీని గెలిపించేందుకు షా ప్రాంతీయ పార్టీలపై విరుచుకుపడడంతో పాటు వాటిని తొక్కేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. షాకు తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బ ఎప్పుడూ తగలేదు. తాజాగా తెలంగాణ పర్యటనలో కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని షా ఓ రేంజ్‌లో విమర్శలు చేశారు. షా తెలంగాణకు అన్ని కోట్లు ఇచ్చాం…ఇన్ని కోట్లు ఇచ్చాం […]
టీఆర్ఎస్ నేతలకు నయా టెన్షన్..!
తెలంగాణలో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ వరుసగా సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు. సర్వేల్లో పనితీరు సక్రమంగా లేని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ వరుసగా వార్నింగ్‌ల మీద వార్నింగులు ఇస్తున్నారు. మరికొందరికి అయితే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కూడా కష్టమే అని తేల్చేశారట. ఇక జూన్ 2వ తేదీనాటికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 27న కేసీఆర్ పార్లమెంటరీ శాసనససభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మూడో […]
మోడీ రాజకీయం అదుర్స్ …మరి ఏం జరుగుతుందో చూడాలి!
పాలిటిక్స్‌లో ఎవరూ పర్మినెంట్ ఫ్రెండ్స్ ఉండరనేది మరో సారి ప్రధాని మోడీ కూడా నిరూపించే ప్రయత్నంలో ఉన్నారా? అంటే ఔననే అనిపిస్తోంది. 2014లో చేతులు పట్టుకుని చెమ్మచెక్కలాడిన టీడీపీ అధినేత బాబుతో బోరు కొట్టి.. వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదేసమయంలో తెలంగాణలో తమకు గిట్టని, తమతో పొసగని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌తో దోస్తీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి తెలంగాణ అధికార టీఆర్ ఎస్.. ఎన్డీయేలో భాగస్వామి కాదు. అయినప్పటికీ.. మోడీ.. కేసీఆర్ సర్కార్ ఏం […]
తెలంగాణలో కేసీఆర్.. ఒంటరవుతున్నారా..?
తెలంగాణలో తనకంటూ తిరుగులేదని భావించిన సీఎం కేసీఆర్‌కి ఇప్పుడు చక్కలు కనబడుతున్నాయా? రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన తర్వాత నెమ్మదిగా ఆయనపై వ్యతిరేకత మొదలవుతోందా? ఇప్పుడు ఓ రకంగా తెలంగాణలో కేసీఆర్ ఒంటరి అవుతున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. నిజానికి తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అనే మాట ఇప్పుడు నిజంగానే తిరగబడుతోంది! ఎన్నికల సమయంలో బంగారు తెలంగాణ లక్ష్యం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో చాలా మటుకు ఇప్పటికీ నెరవేరకపోవడం దీనికి ప్రధాన […]
రైతులకు బేడీలు.. దిగొచ్చిన సీఎం కేసీఆర్
తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళనకు కారణమైన ఖమ్మం రైతులకు బేడీల వ్యవహారంపై సీఎం కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. తనను తాను ఆత్మ రక్షణలో పడేసుకున్న ఈ వ్యవహారం నుంచి చాలా సున్నితంగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. రైతులకు బేడీలు వేయడాన్ని కేసీఆర్ మంత్రి వర్గం తీవ్రంగా ఖండించి, దానిని తప్పేనని ఒప్పుకుంది. అదేసమయంలో బాధ్యులైన ఇద్దరు ఎస్పైలను సస్పెండ్ చేసింది. అయితే, కేసీఆర్ మాత్రం.. ఇది ఉద్దేశ పూర్వకంగా జరిగిందికాదని చెప్పుకొచ్చారు. అంతేకాదు, రైతాంగాన్ని ఊరడించేందుకు […]