టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల తరువాత కాంగ్రెస్ పార్టీలో నిరసన గళం వినిపించింది. రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు నాయకులకు నచ్చకపోయినా సరేలే అనుకొని మిన్నకుండిపోయారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబుకు నమ్మిన బంటుగా పనిచేసి ఆ తరువాత ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని .. రాజకీయంగా ఇబ్బందులు పడి తప్పనిసరి పరిస్తితుల్లో రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడని కొందరు […]