తెలుగులో దర్శకురాలు అనగానే తొలుత అందరికీ విజయ నిర్మల గుర్తుకు వస్తారు. 1971లో దర్శకురాలిగా మారిన ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీశారు. అత్యధిక సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా ఆమె పేరు గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ఇక ప్రస్తుతం నందినీ రెడ్డి చక్కటి సినిమాలు తీస్తూ అలరిస్తున్నారు. ఆమె తీసే ఫీల్ గుడ్ మూవీలకు కుటుంబ పరంగా అంతా చూడడానికి అనువుగా ఉంటాయి. ప్రస్తుతం నందినీ రెడ్డి తప్పితే మరో దర్శకురాలు లేరని అంతా అనుకుంటున్నారు. […]