కర్నూలు జిల్లా టీడీపీ పొలిటికల్ గేమ్ పీక్ స్టేజ్‌కి చేరింది. నంద్యాల ఉప ఎన్నిక విషయంలో ఇప్పటికే టీడీపీ నేతల నిర్ణయం సెగలు పొగలు కక్కిస్తున్న విషయం తెలిసిందే. హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డి సీటును ఆయన సోదరుని కుమారుడు బ్రహ్మానంద రెడ్డికి కట్టబెట్టి.. ఎప్పటి నుంచి పార్టీ కోసం కృషి చేస్తున్న శిల్పా మోహన్‌రెడ్డిని పక్కన పెట్టేశారు. దీంతో ఆయన అలిగి.. జగన్ పంచకు చేరిపోయిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు శిల్పా ఫ్యామిలీ నుంచి […]
Tag: chandra babu
పైసా ఖర్చేలేదు.. మోడీ బాబు ను తెగ వాడేస్తున్నాడన్నమాట!!
అందితే జుట్టు.. అందకపోతే.. కాళ్లు పట్టుకోవాలి! ఇది ఓల్డ్ సామెత. అయితే, ఇది మన దేశాన్నేలుతున్న ప్రధాని నరేంద్ర మోడీకి అక్షరాలా సరిపోతుందని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. తనకు అవసరమైన వారితో ఎలా పనిచేయించుకోవాలో..? తన అవసరం వస్తే.. ఎలా తప్పించుకోవాలో? మోడీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదంటే నమ్మలేరు. కానీ, పాలిటిక్స్‌లో ఆ మాత్రం జిమ్మిక్కులు చేయకపోతే ఎలా అనేవారూ ఉన్నారు. ఇక, విషయానికి వస్తే.. దేశం మొత్తంమీద ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకి, మోడీకి […]
పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యేలు ఆ విషయంలో సక్సెస్
ఏపీలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లాలో అన్ని సీట్లు టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి. మంత్రి మాణిక్యాలరావు ఒక్కరే బీజేపీ నుంచి ఉన్నారు. టీడీపీ అంత కంచుకోటలా ఉన్న ఈ జిల్లాలో ఎమ్మెల్యేలందరూ గత కొద్ది రోజులుగా చంద్రబాబుతో పాటు టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. పశ్చిమగోదావరి ఎస్పీ భాస్కర భూషణ్ పనితీరుపై ఎమ్మెల్యేలు కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు పార్టీకి, ప్రభుత్వానికి […]
మూడు సార్లు లేని టెన్షన్..బాబుకు ఇప్పుడెందుకో..!
రాజకీయ దురంధరుడిగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు అనుక్షణం తెగ టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తోంది. దీనికి కారణం నంద్యాల ఉప ఎన్నిక! ఇప్పటి వరకు దీనికి ఎలాంటి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాలేదు. అయినప్పటికీ.. బాబు మాత్రం అభ్యర్థిని కూడా ప్రకటించేశారు. అంతటితో ఆగకుండా.. నియోజకవర్గాన్ని మినీ రాజధానిగా మార్చేశారు. అంటే.. నిత్యం మంత్రులు అక్కడే ఉంటూ.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారన్నమాట. అయినప్పటికీ.. ఈ నియోజకవర్గం నుంచి గెలుపు మాత్రం అంతవీజీ కాదని ఇంటిలిజెన్స్ […]
ఏపీ సీఎం పేషీలో ఫైటింగ్
మేధావిగా, ఏ విషయంలోనైనా సబ్జెక్ట్‌ను చూసి స్పందిస్తారనే మంచి పేరున్న ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ చుట్టూ ఇప్పుడు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆధిపత్యం కోసం ఆయన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని కొందరు చెబుతున్నారు. ఆ నోటా.. ఈనోటా పాకి ఇప్పుడు ఈ విషయం సీఎం చంద్రబాబు టేబుల్‌కు చేరిందని సమాచారం. విషయం ఏంటంటే.. ప్రభుత్వ మీడియా సలహాదారుగా ఉన్న పరకాలకు, రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ఉన్న వేంకటేశ్వర్లుకు అస్సలు పడడం లేదని ఎప్పటి నుంచో […]
ఐవైఆర్-చంద్రబాబు.. తప్పెవరిది?
రాష్ట్రంలో 24 గంటల్లో తుఫాను మాదిరి వచ్చి వెళ్లిన ఐవైఆర్ ఫేస్‌బుక్ విమర్శల ఉదంతం.. ప్రభావం ఇప్పటితో అయిపోయిందా? లేక ముందు ముందు కూడా చంద్రబాబును, ఆయన ప్రభుత్వాన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తుందా? ప‌్రస్తుతం ఈ ప్రశ్న రాజకీయవర్గాల్లో పెను సంచలనంగా మారింది. దీనికికారణం ఐవైఆర్ ప్రకటించినట్టు ఆయన రాస్తున్న పుస్తమే! తన అనుభవ సారంతో ఐవైఆర్ ఓ పుస్తకం రాస్తున్నారు. దీనిలో బాబుపై చండ ప్రచండ నిప్పులు కురిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదనేది విశ్లేషకుల మాట. […]
జగన్ కోట్లు పెట్టి తెచ్చుకున్న పీకే.. బాబుకు జై కొడతాడా..?
ఎట్టి పరిస్థితిలోనూ 2019లో ఏపీలో అధికారం కైవసం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్న వైసీపీ అధినేత జగన్. ఈ నేపథ్యంలో తనకు ఎలక్షన్ సలహాదారుగా ఉత్తరాది నుంచి కోట్లు ఖర్చు పెట్టి మరీ ప్రశాంత్ కిశోర్‌ను దిగుమతి చేసుకున్నాడు. వచ్చీ రావడంతోనే ప్రశాంత్ కిశోర్ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ సినారియో మీద ఓ సర్వే చేయించాడు. ప్రభుత్వం, ప్రతిపక్షం బలాబలాలు, జనసేనాని దూకుడు.. కాంగ్రెస్ వామపక్షాల గాలి వంటి వివిధ అంశాలపై ఆయన తన దైన స్టైల్‌లో […]
టీడీపీలో నేడు ఐవైఆర్…రేపు వేటు ఎవరిపైనో..!
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్.కృష్ణారావుపై ప్రభుత్వం వేటు వేయడం టీడీపీ వర్గాల్లో పెద్ద కలకలం రేపుతోంది. కృష్ణారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ వాళ్లు పెడుతోన్న పోస్టులను షేర్ చేస్తున్నారన్న కారణంతోనే ఆయన్ను పదవి నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. కృష్ణారావుపై నిర్దాక్షిణ్యంగా వేటు వేసిన ప్రభుత్వం ఆ స్థానంలో కొత్త చైర్మన్‌గా వేమూరి ఆనందసూర్యను నియమించింది. ఏదేమైనా చంద్రబాబు గీత దాటుతోన్న, అవినీతి ఆరోపణలు ఎదర్కొంటోన్న వారి […]
మోడీ ముందు చేతులెత్తేసిన బాబు-జగన్
ప్రత్యేకహోదా ఇస్తామని నమ్మించి మోసం చేసిన కేంద్రాన్నిఇరుకునపెట్టే అవకాశాన్ని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ చేజార్చుకున్నాయి. హోదాతో వచ్చేది లేదని, అందులో ఉన్నవన్నీ ప్యాకేజీలో ఉన్నాయని చెబుతున్న టీడీపీ.. హోదా కోసం రెండేళ్లుగా పోరాడుతున్నామని మభ్యపెడుతున్న వైసీపీ.. తమకు ఏపీ ప్రజల ప్రయోజ నాల కంటే తమ సొంత ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి రుజువుచేశాయి. కేంద్రం ఏం చెప్పినా, ఏ నిర్ణయం తీసుకున్నా.. జీహుజూర్ అంటూ తలాడిస్తున్న ఆ పార్టీలు.. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి తమ మద్దతు […]