ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఈ సస్పెన్షన్ల పర్వానికి బ్రేక్ ఎప్పుడు పడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ జాబితాలో చట్టసభల్లో ఉన్న ఎమ్మెల్యేల నుంచి కౌన్సెలర్ల వరకు ఉంటున్నారు. వీరికి తోడు ఇప్పుడు ఏకంగా ఒకరిద్దరు ఎంపీలు సైతం పార్టీనే ధిక్కరిస్తున్నారు. వారి పేర్లు సైతం సస్పెన్షన్ జాబితాలో ఉన్నా వారిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకునేందుకు సాహసించలేని పరిస్థితి. టీడీపీ సస్పెన్షన్ల పరంపరలో మరో నాయకుడు ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ […]
Tag: chandra babu
ఇద్దరు చంద్రుల షేక్ హ్యాండ్ అందుకేనా?
ఏపీ, తెలంగాణ సీఎంలు కేసీఆర్, చంద్రబాబుల వైఖరే డిఫరెంటు. ఈ ఇద్దరూ అవసరాన్ని బట్టి తిట్టుకోవడం, అవసరాన్ని బట్టి పొగుడుకోవడం పరిపాటైంది. నిన్న మొన్నటి వరకు కృష్ణా వాటర్ విషయంలో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించిన ఈ ఇద్దరు ఇప్పుడు ఢిల్లీలో జరిగిన రాష్ట్రపతి నామినేష్ ఘట్టానికి వెళ్లిన సందర్భంలో మాత్రం చిరునవ్వులు చిందుకుని, షేక్ హ్యాండులు ఇచ్చేసుకుని మీడియాకు ఫోజులిచ్చారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి చుట్టూతానే పాలిటిక్స్ రింగులు కొడుతున్నాయి. ఎవరికివారే సొంత లాభం లేకుండా […]
అమరావతి పూలింగ్‌పై ప్రపంచ బ్యాంకు తనిఖీలు!
సీఎం చంద్రబాబు అమరావతి కలలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. ఏ ముహూర్తాన ఆయన అమరావతికి ప్లేస్ డిసైడ్ చేసుకున్నాడో.. అప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాడు. తాజాగా ఆయన అమరావతి కోసం చేసిన ల్యాండ్ పూలింగ్‌పై ప్రపంచ బ్యాంకు తనిఖీ కొరడా ఝళిపిస్తోంది. బాబు చేసిన ల్యాండ్ పూలింగ్‌తో తాము నష్టపోయామని పేర్కొంటూ రాజధాని ప్రాంత రైతులు ఇప్పటికే ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారు. మొదట్లో బ్యాంకు అధికారులు ఇది మామూలే కదా అనుకున్నా.. లేఖల పరంపర […]
రామోజీ – రాధాకృష్ణ చంద్రబాబుకు ఎవరు ఎక్కువ..!
మీడియా మేనేజ్‌మెంట్‌లో సీఎం చంద్రబాబును మించిన వారు లేరనే చెప్పుకోవాలి! ముఖ్యంగా అలనాడు ఎన్టీఆర్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఈనాడుతోనే.. ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాయించి.. పదవి నుంచి దింపించేశారు. ఆ తర్వాత అదే పత్రిక ఆయనకు అండగా నిలబడుతూ వస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈనాడు పత్రికను పక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దాని కంటే మిన్నగా, ప్రభుత్వాన్ని భుజాలపై మోస్తున్న ఆంధ్రజ్యోతిని అందలం ఎక్కించాలని భావిస్తున్నారట. దీనికి […]
బ్రాహ్మణులను వాడేస్తున్న పొలిటికల్ నేతలు!
రాష్ట్రంలో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వ్యవహారంతో పాలిటిక్స్ అన్నీ ఒక్కసారిగా బ్రాహ్మణుల చుట్టూ చేరిపోయాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి ఐవైఆర్‌ను తొలగించడాన్ని తీవ్రస్థాయిలో తప్పుపడుతున్న విపక్షం వైసీపీ.. ఈ విషయానికి కాస్త పొలిటికల్ కలరింగ్ ఇచ్చి బెనిఫిట్ పొందేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. మరోపక్క, చంద్రబాబుపై పీకల్లోతు ఆగ్రహంతో ఉన్న కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా ఇప్పుడు బ్రాహ్మణులను సెంట్రిక్‌గా తీసుకుని కామెంట్లు చేశారు. 2019లో బ్రాహ్మణులు అంతా ఏకమై బాబుకు […]
కొత్త టార్గెట్: ముందు జగన్.. తర్వాత చంద్రబాబు
అధికార పార్టీ నాయకులు చేసే అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళితే.. ప్రతిపక్షానికైనా, ఇతర పార్టీలకైనా మనుగడ ఉంటుంది. అప్పుడే ఆయా పార్టీల బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదే ఇప్పటివరకూ వస్తోంది. కానీ దీనికి భిన్నంగా ఏపీ కాంగ్రెస్ నిర్ణయించింది. టీడీపీని కాకుండా .. ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ను లక్ష్యంగా చేసుకోవాలని హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీఅయ్యాయట. దీని వెనుక బలమైన […]
బాబుకు వాస్తు పిచ్చి.. పార్టీ ఆఫీస్‌కి వెళ్లడం మానేశారు!
ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సొంత పార్టీని, పార్టీ కార్యకర్తలను ఎవరూ దూరం చేసుకోరు. కనీసం నెలకోసారైనా వాళ్లను పలకరించి, పరిస్థితిపై వాకబు చేస్తారు. కానీ, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ విషయంలో తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా ఉంటున్నారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. విషయంలోకి వెళ్తే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణల్లో టీడీపీని రెండుగా విభజించారు. ఎక్కడికక్కడ బలోపేతం చేసుకుంటూ.. టీడీపీని జాతీయ పార్టీగా కూడా ప్రకటించారు. చంద్రబాబు […]
కాపు నేతతోనే ముద్రగడకు చెక్
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి కదం తొక్కేందుకు సిద్ధమవుతున్నారు. చలో అమరావతి అంటూ.. ప్రభుత్వంపై శమర శంఖం పూరించేందుకు సన్నద్ధమవుతున్నారు. గతంలోలా తమ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించినా.. ఈసారి మాత్రం వెనకడుగు వేసేది లేదని బల్ల గుద్దిమరీ చెబుతున్నారు. ఆయన చేసిన ప్రయత్నాలన్నింటినీ ఆదిలోనే తొక్కేసిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు కూడా అదే పనిలో పడ్డారు. ఈసారి కూడా ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవాలనే దృఢనిశ్చయంతో ఉన్నారు. కాపు నేతలకు సమాధానాలిచ్చేందుకు ఆ సామాజిక వర్గానికి […]
ఏపీ కేబినెట్ మళ్లీ మారుతోందా..!
`సీఎం చంద్రబాబుతో సమానంగా మంత్రులు పరిగెత్తలేకపోతున్నారు. వారికి కేటాయించిన శాఖలపై ఇంకా పట్టు సాధించలేకపోతున్నారు`- ఈ మాట మూడేళ్లుగా ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంది. కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు ప్రయత్నించి.. ఆ ముద్రను చెరిపేయాలని భావించారు. ఇదే ఎన్నికల టీంగా భావించారు. కానీ మంత్రులెవరూ ఆయన ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో ఏం చేయాలా అని తీవ్రంగా మంతనాలు జరుపుతున్నారట. ముఖ్యంగా మరోసారి మంత్రి వర్గ విస్తరణ చేస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. […]