కాంగ్రెస్ పార్టీ.. జాతీయస్థాయిలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాభవం కోల్పోయింది. తెలంగాణలో చెప్పుకోదగ్గ ప్రజాప్రతినిధులు ఉన్నారు కానీ ఏపీలోమాత్రం దారుణం.. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే పార్టీ కార్యకలాపాల నిర్వహణకు కూడా దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన అనంతరం కొద్దిరోజుల పాటు ఏపీసీసీ, టీపీసీసీ కమిటీలో ఒకే చోట నిర్వహించారు. ఏపీసీసీ ఇందిరాభవన్నుంచి కార్యకలాపాలు నిర్వహించగా.. టీపీసీసీ గాంధీభవన్ నుంచి నిర్వహించింది. ఆ తరువాత ఏపీసీసీ కార్యాలయం విజయవాడికు మారిపోయింది. విజయవాడకు మారిన అనంతరం […]