అనుష్క అంటే ఇష్టపడని వారు ఉండరు. ఆన్ స్క్రీన్ గ్లామర్ ఒలకపోతలో ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటుందో, ఆఫ్ స్క్రీన్ ట్రెడిషన్‌కి అంతే కమిట్‌మెంట్‌తో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ‘అరుంధతి’ ముందు అనుష్క వేరు. ఆ తరువాత అనుష్క వేరు. ‘అరుంధతి’ సినిమా ఆమెకు అంతగా స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. అంతకు ముందు వరకూ గ్లామర్ డాళ్‌గానే కనిపించిన అనుష్క హుందా అయిన పాత్రలకి ఆ తరువాత నుంచి కేరాఫ్ అడ్రస్ అయ్యింది. అయినప్పటికీ ఇప్పటికీ గ్లామర్ పాత్రలని మానలేదు. […]
