నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే బాలయ్య సెంచరీ కొట్టి అరుదైన ఘనత సాధించారు. అఖండ సినిమా తాజాగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకుంది. […]