తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారే తప్ప, తెలంగాణలో పార్టీని బాగు చేయలేకపోతున్నారు. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యత ఆయా రాష్ట్రాల్లోని పార్టీ నాయకత్వాలదే. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీకి నాయకత్వమే లేదు. అది విభజనతో జరిగిన నష్టం. తెలంగాణలో అలా కాదు కదా. తెలంగాణలో టిఆర్‌ఎస్ దెబ్బకి కాంగ్రెసు నాయకత్వం కుదేలైంది. ‘మేం తెలంగాణ ఇచ్చినా, మీరు పార్టీని బాగు చేయలేకపోతున్నారు’ అని తెలంగాణ నుంచి వెళ్ళిన ప్రతి నాయకుడికీ సోనియాగాంధీ తలంటు పోసేస్తున్నారట. […]
Category: Politics
చంద్రబాబు చైనా నుంచి ఏం తీసుకొస్తారు?
రాజధాని నిర్మాణమంటే ఏ నాయకుడికైనా కత్తి మీద సాము లాంటిది. నాయకుడిలోని నాయకత్వ లక్షణాల్ని సవాళ్ళే బయటపెడతాయి. సంక్షోభాల్ని అవకాశాలుగా మలచుకోవడం నాయకుల లక్షణం. ఓ రాజధానిని నిర్మించవలసి వస్తుందని తెలుగు రాజకీయాల్లో ఏ నాయకుడూ అనుకుని ఉండడు. హైదరాబాద్‌ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు పాత్ర అద్వితీయం. అంతకు ముందు, ఆ తరువాత కూడా ముఖ్యమంత్రులుగా పనిచేసినవారు హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేశారు. రాజధాని అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అయితే కొత్త రాష్ట్రానికి రాజధాని […]
ఆ 12 మందితో కేసీర్ కి తలనొప్పే
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పేరుకు మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా మొత్తం 18 మంది వున్నారు. ఇందులో నలుగురైదురు మినహా మిగిలిన వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. క్యాబినేట్‌లోని 18 మంది మంత్రుల్లో 12 మంది మంత్రుల తీరు మాత్రం ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. తమ శాఖలపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్తున్న వారు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే వాదనలు […]
కొత్తపల్లి గీత సరికొత్త రికార్డ్!
‘నన్ను గెలిపిస్తే నిరంతరం ప్రజా సేవకు అంకితమవుతాను. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాను’. ఇది 2014 ఎన్నికల సమయంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసిపి తరుపున పోటీ చేసిన కొత్తపల్లి గీత అన్న మాటలు. ఆమె మాట నమ్మిన గిరిజనులు భారీ ఆధిక్యతతో గెలిపించారు. కాని గీత మాత్రం ఓట్లేసి గెలిపించిన గిరిజనులను మోసం చేసింది. నాటి నుంచి నియోజకవర్గానికి వచ్చిన పాపాన పోలేదు. అరకు ఎంపీగా ఎన్నికైన […]
భారత్ ఓడి గెలిచింది-చైనా గెలిచి ఓడింది
గెలిచినట్టు భావిస్తున్న చైనా నిజంగా ఓడిపోయింది. వైఫల్యం పొందినట్టు ప్రచారానికి గురి అవుతున్న మన దేశం విజయం సాధించింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన అణు సరఫరాల కూటమి-ఎన్‌ఎస్‌జి-సర్వ ప్రతినిధి సమావేశంలో చైనా ఒంటరి అయిపోవడం చైనాకు సంభవించిన దౌత్య పరాజయం. చైనా తప్ప కూటమిలోని మిగిలిన దేశాలు దేశానికి బాసటగా నిలబడడం సాధించిన వ్యూహాత్మక విజయం. ఇన్ని దేశాలు మనకు మద్దతు పలికినప్పటికీ ఎన్‌ఎస్‌జిలో మనకు సభ్యత్వం దక్కకుండా చైనా అడ్డుకుంది. ఇలా అడ్డుకోగలగడానికి […]
చైనా స్టీల్ అమరావతికి వచ్చేస్తోంది!
ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు చైనా ప్రభుత్వ రంగ సంస్థ ముందుకొచ్చింది. చైనా ప్రభుత్వరంగంలోని అతిపెద్ద ఉక్కు కంపెనీ అన్‌స్టీల్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జరిపిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేశారు. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమైనారు. ఆన్‌స్టీల్ కంపెనీతో జరిగిన సమావేశంలో నూతనంగా నిర్మిస్తున్న […]
వీళ్ళు పోలీసులా సిగ్గు సిగ్గు!!
యూపీలో దొంగలు.. రౌడీలే కాదు. పోలీసులు కూడా రెచ్చిపోతున్నారు. వారికి వారే వీధి రౌడీల్లా దర్శనం ఇస్తున్నారు. వాటాలు పంచుకునేందుకు తొలుత చర్చను ప్రారంభించి పొరపొచ్చాలు రావడంతో తన్నుకున్నారు.చుట్టూ అందరు చూస్తున్నారనే సోయి కూడా మరిచి పట్టపగలు తన్నుకున్నారు. లంచాలు పంచుకునే విషయంలోనే ఈ ఘర్షణకు వారు దిగారు. రోడ్డుపైనే పరస్పరం వారు తలపడ్డారు. ఈ సంఘటనపట్ల సామాన్య జనం విస్తుపోతుండగా ఉన్నత పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
బాబ్బాబు ఇంకోసారి రెఫరెండం పెట్టరూ ప్లీజ్!!
తమ దాకా వస్తే కానీ ఏదీ బోధపడదన్నట్టు తయారైంది బ్రిటీష్ సామాన్య ప్రజల గోడు.అందరూ విడిపోదామంటున్నారు కాబట్టి మనం ఒక రాయి వేద్దాం అన్న చందాలో అసలు దేనికి ఓటు వేస్తున్నామో దాని పర్యవసానం ఏంటో తెలీకుండానే సగం మందికి పైగా యూరో జోన్ నుండి విడిపోవడానికి మద్దతుగా ఓటేశారు.తీరా ఫలితాలు వచ్చి పౌండ్ 30 ఏళ్ల వెనక్కి వెళ్లి ఒక్కొక్కరి ఆస్తి నిమిషాల్లో సగానికి కరిగిపోవడంతో బ్రిటిషర్లకి కళ్ళు బైర్లు కమ్మాయి.చేతులు కాలాక ఆకులు పట్టుకున్న […]
సిద్దరామయ్య స్టేజ్ ముద్దు గోల
ఖరీదైన వాచ్, కుమారుడి కోసం లాబీయింగ్‌లు, ఏసీబీ ఏర్పాటు, కాకి వాలిందని కారు మార్చడం ఇలా ఏది చేసినా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తలనొప్పిగా మారుతోంది. తాజాగా ప్రజలందరూ చూస్తుండగానే..ఓ బహిరంగ సభలో అందరి ముందు ముఖ్యమంత్రికి ఓ మహిళ ముద్దు పెట్టింది. ఇవాళ బెంగుళూరులో జరిగిన కురుబ కమ్యూనిటీ సన్మాన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. చిక్‌మగ్‌ళూర్ జిల్లా తరికేరే ప్రాంతానికి చెందిన పంచాయతీ సభ్యురాలు గిరిజా శ్రీనివాస్‌ను సీఎం సిద్దరామయ్య సన్మానించారు. అంతే ఆమె […]