ఇకనైనా ఏపీ నాయకులు మారతారా

త‌మిళులు జ‌ల్లికట్లు కోసం పోరాడిన తీరు ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు స్ఫూర్తిగా నిలిచింది. జల్లికట్టు స్ఫూర్తితో కెవిపి, చలసాని, శివాజీ, పవన్, వైకాపాలతో పాటు ఇంకా చాలా మంది ప్రత్యేక హోదా కోసం కూడా గట్టిగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మంచి స్పందన వ్యక్తమవుతోంది. యువత కూడా పోరాటం దిశగా ఆలోచిస్తోంది. వీళ్ల ఆలోచ‌న‌లను ప‌సిగ‌ట్టిన టీడీపీ నాయ‌కులు వెంట‌నే రంగంలోకి దిగిపోయారు. యనమల రామకృష్ణుడితో సహా అందరూ తలా ఒక ప్రకటన చేసిపడేశారు. […]

డాన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న ప‌వ‌ర్ టేస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు! స‌మాజానికి ద్రోహులుగా భావిస్తున్న ఒక‌రిద్ద‌రి విష‌యంలో ఆయ‌న ఎంత‌గా సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకుంటున్నారో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. చేతిలో అధికారం ఉన్నా.. అలాంటి వాళ్ల‌ని ఏమీ చేయ‌లేక‌పోతున్నారు! అని అనేవాళ్ల‌కి కౌంట‌ర్‌గా బాబు ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. తెర‌వెనుక సాగిన ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు బ‌య‌ట‌కు లీకైంది. త‌న బాధ్య‌త‌ల విష‌యంలో బాబు ఎంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారో చెప్ప‌క‌నే చెప్పింది. విష‌యంలోకి వెళ్తే.. […]

జనసేన అధినేత పవన్ దూకుడు మొదలైంది!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ త‌న దూకుడును స్టార్ట్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ట్వీట్లు, కామెంట్ల‌కే ప‌రిమిత‌మైన ప‌వ‌న్ తాజాగా త‌న ప‌వ‌ర్ ఎలా ఉంటుందో చూపించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని ప‌లు సంద‌ర్భాల్లో పెద్ద ఎత్తున లేవ‌నెత్తిన ప‌వ‌న్ దాని సాధ‌న కోసం అంద‌రూ న‌డుం బిగించాల‌ని పిలుపునిచ్చారు. వాస్త‌వానికి ప్ర‌త్యేక ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూల‌తో పోల్చిన ప‌వ‌న్‌.. ఆ త‌ర్వాత కూడా ప్యాకేజీని ప‌లు సంద‌ర్భాల్లో త‌ప్పుప‌ట్టారు. ఇక‌, ఎప్ప‌టి నుంచో దీనిపై పెద్ద […]

మీడియా సెల్ సంస్కరణలతో పరకాలకు చెక్

ఆంధ్రప్ర‌దేశ్ మీడియా స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌లో మునుప‌టి ఉత్సాహం క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా కొత్త స‌మాచార శాఖ క‌మిష‌న‌ర్‌గా కృష్ణ మోహ‌న్ నియ‌మితులైన త‌ర్వాత ప్ర‌భాక‌ర్ పేరు అంతగా వినిపించ‌డం లేదు. దీంతో ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ అధికారాల్లో కోత విధించారా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ఎంతో ఉత్సాహంతో క‌నిపించిన ఆయ‌న.. ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డానికి ఇదే కార‌ణ‌మంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ‘పవర్’కు కత్తెర పడిందా? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. […]

ఏపీ టీడీపీలో కొత్త ఎమ్మెల్సీలు ఎవరు..!

రెండేళ్ల‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు.. అందులో గెలిస్తే ఎమ్మెల్యే.. ఒక‌వేళ ఓడితే ఐదేళ్ల పాటు ప‌వ‌ర్‌లో లేకుండా ఉండాల్సిందే! దీనిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ ఆశావ‌హుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఏపీలో త్వ‌ర‌లో ఎమ్మెల్సీ నగారా మోగ‌నుంది. ప్రస్తుతం దాదాపు 22 స్థానాలు ఖాళీ అవుతుండగా వీటిలో శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికయ్యేవారు ఏడుగురు ఉన్నారు. ఇందులో ప్రస్తుత బలాబలాలను బట్టి టీడీపీకి 6 వైకాపాకు ఒక స్థానం లభించనున్నాయి. అటు పార్టీలోకి కొత్త‌గా చేరిన వారితో పాటు.. […]

టీడీపీ లో ఫైటింగ్ … ఎత్తులు..పై ఎత్తులు

టీడీపీ బ‌లంగా ఉన్న అనంత‌పురం జిల్లాలో వ‌ర్గ విభేదాలు భ‌గ్గుమంటున్నాయి. ఆధిప‌త్య పోరు పార్టీని బ‌ల‌హీనం చేస్తోంది. ముఖ్యంగా  క‌దిరి ఎమ్మెల్యే, నియోజ‌క‌వర్గ ఇన్‌చార్జి మ‌ధ్య ఆధిప‌త్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ఏకంగా ఇన్‌చార్జి త‌ర‌ఫు నేత‌లంతా ఏకంగా పార్టీకి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించే స్థాయికి చేరుకుందంటేనే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గ‌మ‌నించ‌వ‌చ్చు!! కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా – నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ కందికుంట వెంకటప్రసాద్ ల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య […]

జగన్ ఇలా థింక్ చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు!

ఏపీ సీఎం చంద్ర‌బాబును ప్ర‌తి విష‌యంలోనూ ఏకేసే.. వైకాపా అధినేత జ‌గ‌న్‌.. తాజాగా మ‌కాం విష‌యంలోనూ ఓ రేంజ్‌లో ఆడేసుకున్నాడు. ఇటీవ‌ల ఈ విష‌యం మీడియా ప్ర‌స్తావించ‌గా.. జ‌గ‌న్ పెద్ద ఎత్తున త‌న ప్లాన్ చెప్పుకొచ్చాడు. విష‌యం ఏంటంటే.. విభజన త‌ర్వాత సీఎం చంద్ర‌బాబు త‌న అధికారిక మ‌కాంని వెల‌గ‌పూడికి మార్చేశారు. దీంతో ఏపీ ప్ర‌భుత్వ వ‌ర్గాలు కూడా హుటాహుటిన ఏపీకి వెళ్లిపోయాయి. ప్ర‌త్యేకంగా తాత్కాలిక స‌చివాల‌యం నిర్మించారు. దాదాపు వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల‌ను సైతం ఏపీలోనే […]

పవన్ వెనుక ” ఈనాడు ” సైన్యం ఉందా?!

ఏ రాజ‌కీయ నేత ఎదుగుద‌ల వెన‌కాలైనా ఎవ‌రో ఒక మేధావి ఉంటాడంటారు! ఇటీవ‌ల కాలంలో ట్వీట్ల‌తో రెచ్చిపోతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వెన‌కాల కూడా కొంద‌రు మేధావులు ఉన్నార‌నే టాక్ వ‌స్తోంది. నిజానికి 1984లో ఎన్‌టీఆర్ టీడీపీని స్థాపించిన‌ప్పుడు కూడా కొంత మంది ఆయ‌న వెన‌కాల ఉండి చ‌క్రం తిప్పారు. వీరిలో ముఖ్య‌మైన వ్య‌క్తి ఈనాడు అధినేత రామోజీరావు. పార్టీ ఎదుగుద‌ల‌, అధికారంలోకి వ‌చ్చే దాకా ఎన్‌టీఆర్‌కి దిశానిర్దేశం చేయ‌డంలో రామోజీ పాత్ర ఇప్ప‌టికీ ఓ […]

టీడీపీ – బీజేపీ దాగుడుమూత‌ల దండాకోరాట‌

ఏపీలో అధికార టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఈ క్ర‌మంలోనే అటు కేంద్రంలోనూ టీడీపీతోనూ క‌లిసి న‌డుస్తోంది. దీంతో ఇటు రాష్ట్రంలో రెండు మంత్రుల స్థానాలు, అటు కేంద్రంలో రెండు స్థానాలు ఈ రెండు పార్టీలూ ఇచ్చి పుచ్చుకున్నాయి. దీంతో ఇరు ప‌క్షాల న‌డుమ కెమిస్ట్రీ బాగానే కుదిరింది. అయితే, ఈ కెమిస్ట్రీ కొన్ని కొన్ని స‌మ‌స్య‌లను సునాయాసంగా ప‌రిష్క‌రించేందుకు కూడా ఉప‌యోగించుకుంటున్నార‌ట ఇరు ప‌క్షాల నేత‌లు. ముఖ్యంగా రాష్ట్రంలో కేంద్రం ఏమీ చేయ‌డం లేద‌ని టీడీపీ […]