శశికళకు భారీ షాక్ … పన్నీరు గూటికి పలువురు ఎమ్మెల్యేలు

తమిళనాడులోనే అతిపెద్ద పార్టీలలో ఒకటైన అన్నాడీఎంకే రెండున్న‌ర ద‌శాబ్దాల త‌ర్వాత భారీ చీలిక దిశ‌గా వెళుతోంది. ద‌క్షిణాదిలో పెద్ద రాష్ట్రాల‌లో ఒక‌టి అయిన తమిళ‌నాడు రాజ‌కీయాల్లో ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన ఈ పార్టీని 1972లో ఎంజీ రామచంద్రన్ స్థాపించారు. ఎంజీఆర్ త‌ర్వాత ప్ర‌ముఖ సినీన‌టి జ‌య‌ల‌లిత ఈ పార్టీని రెండున్న‌ర ద‌శాబ్దాల పాటు త‌న క‌నుసైగ‌ల‌తో న‌డిపించారు. గ‌తంలో ఎంజీఆర్ చ‌నిపోయిన‌ప్పుడు రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన ఈ పార్టీ ఇప్పుడు మ‌రోసారి భారీ చీలిక ద‌శగా […]

త‌మిళ‌నాడు కొత్త సీఎం గురించి షాకింగ్ సీక్రెట్స్‌

తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీలో బలనిరూపణకు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వంకు అవ‌కాశం ఇస్తారా ? లేదా అన్నాడీఎంకే శాస‌న‌స‌భా ప‌క్ష‌నేత శ‌శిక‌ళ స్థానంలో ఎంపికైన ప‌ళ‌నిస్వామిని ఆహ్వానిస్తారా ? అన్న‌ది ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జయలలిత మరణంతో ఓ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో అధికార అన్నాడీఎంకేకు 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన డీఎంకేకు 89 […]

త‌మిళ‌నాట‌.. మ‌రో పొలిటిక‌ల్ వార్‌! దీప వ‌ర్సెస్ దీప‌క్‌

సుప్రీం తీర్పుతో త‌మిళ‌నాడు రాజ‌కీయం కొత్త మ‌లుపు తిరిగింది! ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం సీటు కోసం ఆరాట ప‌డ్డ శ‌శిక‌ళ ఇప్పుడు జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో సీఎం సీటులో ఎవ‌రు కూర్చుంటారు? ప‌న్నీర్ సెల్వానికి మ‌ద్ద‌తు పెరుగుతుందా? శ‌శి త‌దుప‌రి వ్యూహం ఏమిటి? అంద‌రి ఆలోచ‌న‌లూ ఇవే. ఈ నేప‌థ్యంలోనే త‌మిళ‌నాడులో ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌గా ప‌రిచ‌యం లేని ఇద్ద‌రు తెర‌మీద‌కి వ‌చ్చారు. తామే దివంగ‌త జ‌య‌ల‌లిత‌కు అస‌లు సిస‌లు వార‌సుల‌మ‌ని […]

2019 ప‌వ‌న్ పోటీ చేసి నియోజ‌క‌వ‌ర్గం అదేనా?

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్ప‌డం ఖాయ‌మై పోయిన నేప‌థ్యంలో ఆయ‌న ఎక్క‌డి నుంచి పోటీ చేస్తారు? ఎంత మెజారిటీ వ‌స్తుంది? అస‌లు గెలుస్తారా? లేదా? ఇలాంటి సందేహాల‌కు కొద‌వ‌లేదు. ఎందుకంటే.. తెలుగునాట కొన్ని ద‌శాబ్దాల పాటు వెండి తెర‌పై తిరుగులేని ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించి మెగాస్టార్‌గా వెలుగొందిన చిరంజీవి సైతం త‌న సొంత జిల్లా ప‌శ్చిమ గోదావ‌రి నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప‌వ‌న్‌పై అంద‌రి దృష్టీ […]

జ‌గ‌న్‌కి కూడా శ‌శిక‌ళ బాట త‌ప్ప‌దా?!

దేశం మొత్తం ఇప్పుడు త‌మిళ‌నాడు వైపు చూస్తోంది! సీఎం పీఠంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న దివంగ‌త జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ అక్ర‌మార్జ‌న కేసులో జైలుకు వెళ్ల‌నున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు తాను సింహాన్న‌ని, త‌న‌ను ఎవ‌రూ మోసం చేయ‌లేర‌ని బీరాలు ప‌లికిన శ‌శి నేడు క‌న్నీటి ప‌ర్యంటి ప‌ర్యంత‌మైంది. అమ్మ అండ చూసుకుని, తెర‌వెనుక సాగించిన అక్ర‌మాల పుట్ట ప‌గ‌లి.. అత్యున్న‌త న్యాయ‌స్థానం జైలు శిక్ష విధించ‌డం దేశ చ‌రిత్రంలో కొత్త‌కాదు. గ‌తంలోనూ అనేక మందికి ఈ […]

అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌కు రిసార్ట్స్‌లో చిత్ర‌హింస‌లు

త‌మిళ‌నాడులో కొద్ది రోజులుగా హై స‌స్పెన్ష్ టెన్ష‌న్ క్రియేట్ చేసిన రాజ‌కీయ డ్రామాకు ఈ రోజుతో చాలా వ‌ర‌కు క్లారిటీ వ‌చ్చేసింది. సీఎం అయ్యేందుకు అన్ని ర‌కాల ప్లాన్లు వేసిన వీకే శ‌శిక‌ళ ప్లాన్లు అన్ని బెడిసికొట్టాయి. ఆమెకు నాలుగు సంవ‌త్స‌రాలు జైలు శిక్ష ప‌డ‌డంతో ఆమె ముఖ్య‌మంత్రి అయ్యేందుకు వీలు లేకుండా పోయింది. అలాగే ఆమె వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే వీలు కూడా లేదు. ఇదిలా ఉంటే ఎలాగైనా సీఎం అవ్వాల‌ని అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌తో […]

తెలంగాణలో కొత్త పార్టీ వెనుక ఆ ముగ్గురే!

తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం అక్కడ సీఎం కేసీఆర్ జోరుకు స్పీడ్ బ్రేక‌ర్ వేసే నాయ‌కులు ఎవ్వ‌రూ క‌న‌ప‌డ‌డం లేదు. ప్ర‌తిప‌క్ష పార్టీలుగా కాంగ్రెస్‌-బీజేపీ-టీడీపీ అన్ని డిజాస్ట‌ర్ షో వేస్తున్నాయి. ప్ర‌స్తుతం అక్క‌డ ట్రెండ్స్‌ను బ‌ట్టి 2019లో కూడా కేసీఆర్ తిరుగులేని మెజార్టీతో మ‌రోసారి సీఎం అవుతార‌ని అంద‌రూ అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌లో సీనియ‌ర్ల‌కు, స‌మ‌ర్థులైన నాయ‌కుల‌కు కొర‌త లేకున్నా వారు మూడు గ్రూపులు – ఆరు లీడ‌ర్లు అన్న చందంగా […]

శ‌శిక‌ళ‌కు నాలుగేళ్ల జైలు శిక్ష‌…సీఎం రేసులో దీప‌క్‌

త‌మిళ‌నాడు సీఎం అయ్యేందుకు జ‌య నెచ్చెలి శశిక‌ళ గ‌త కొద్ది రోజులుగా వేస్తోన్న ఎత్తులు, ప‌న్నుతున్న వ్యూహాలు మామూలుగా లేవు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌ను సీక్రెట్‌గా బీచ్ రిసార్ట్స్‌లో ఉంచి శిబిరం నిర్వ‌హిస్తున్నారు. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సీఎం అవ్వాల‌ని క‌ల‌లు కంటోన్న శశికళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. ఈ కేసులో శ‌శిక‌ళ‌తో పాటు మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు […]

కొత్త కుట్ర బయటపెట్టిన శశికళ

త‌మిళ‌నాడులో సీఎం సీటు కోసం జ‌రుగుతున్న ర‌స‌వ‌త్త‌ర పోరులో రోజుకో సంచ‌ల‌న విష‌యం వెలుగు చూస్తోంది. ప్ర‌స్తుత ఆప‌ద్ధ‌ర్మ సీఎం ప‌న్నీర్ సెల్వం.. జ‌య మ‌ర‌ణంపై అనుమానాలున్నాయంటూ పేల్చిన బాంబు బాగానే పేలింది. త‌మిళ ప్ర‌జ‌లు దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న‌ను కోరుతుండ‌డం ఆయ‌న‌కు హ‌ర్షాన్ని నింపింది. చిన్న‌మ్మ‌ను బాగా దెబ్బ‌తీశాన‌ని ఆయ‌న సంబ‌ర‌ప‌డుతున్నారు. అయితే, అదే స‌మ‌యంలో సీఎం సీటు త‌న‌నేద‌ని వాదిస్తున్న శ‌శిక‌ళ‌.. ప‌న్నీర్‌కు అదేస్థాయిలో కౌంట‌ర్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ నేప‌థ్యంలోనే […]