వచ్చే ఎన్నికల్లో మెగా అభిమానులు ఎటువైపు? అనే ప్రశ్న రాజకీయాల్లో కొంతకాలం నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు ఈ ప్రశ్నకు తెరపడింది. అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ వైపు, తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన అంటూ తలోవైపు ఉండటంతో ఎవరిని సపోర్ట్ చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయారు మెగాభిమానులు. కానీ ఇప్పుడు వీరందరినీ ఏకతాటిపై నిలిపేందుకు మెగా బ్రదర్ నాగబాబు రంగంలోకి దిగారు. ఎప్పుడూ అన్న చాటు తమ్ముడిగా ఉండే నాగబాబు.. ఇప్పుడు తమ్ముడి చెంతకు […]
Category: Politics
పళనిస్వామికి షాక్: చిన్నమ్మ టీంలో 30 మంది జంప్
శశికళకు సీఎం పోస్టు చేజారడంతో అన్నాడీఎంకే సీనియర్ లీడర్ సెంగొట్టయన్‌కు ఆ ఛాన్స్ వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా పళనిస్వామి రేసులోకి వచ్చేశారు. సెంగొట్టయన్ కు షాకిచ్చారు. అయితే పళనిస్వామిని సీఎం చేసే విషయంలో అప్పుడే చిన్నమ్మ శశికళ విషయంలో లుకలుకలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. సీఎం సీటు రేసులో ఉన్న పళనిస్వామి సెంగొట్టయన్ కంటే చాలా జూనియర్. సెంగొట్టయన్‌కు ఛాన్స్ వద్దనుకుంటే పళనిస్వామి కంటే సీనియర్లు తంగమణి, వేలుమణి ఉన్నారు. కానీ పళనిస్వామికి ఆ అవకాశం […]
యూపీలో గెలుపుకు ” మాయా ” వ్యూహం
దేశంలోనే పెద్ద రాష్ట్రమైన యూపీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికలు బీఎస్పీ అధినేత్రి మాయావతికి చావోరేవోగా మారాయి. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు జోరు చూపిస్తుంటే…మోడీ నేతృత్వంలోని బీజేపీ కూడా అధికారం తమదే అని ఆరాటపడుతోంది. ఈ రెండు పార్టీల మధ్యలో బీఎస్పీ సైతం పోటీకి సైసై అంటోంది. ఈ ఎన్నికలు బీఎస్పీకి లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారాయి. ఎలాగైనా గెలిచేందుకు మాయావతి సరికొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దళితుల పార్టీగా ముద్రపడిన […]
ఏపీలో సీన్ రివర్స్…వైసీపీలోకి జోరుగా వలసలు
ఏపీ రాజకీయాల్లో షాకింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు అధికార టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను, నాయకులను తన పార్టీలో చేర్చేసుకుంది. అయితే గత కొద్ది రోజులుగా ఇతర పార్టీలకు చెందిన సీనియర్లు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధుల వారసులు వరుసగా జగన్ గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొప్పన మోహన్‌రావు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక ఇప్పుడు వంతు కర్నూలు జిల్లాకు […]
తమిళనాడు గవర్నర్ ఇప్పుడైనా పనిచేస్తారా?!
తమిళనాడులో ఇప్పుడు కొందరు ఊహించిన పరిణామాలే జరిగిపోయాయి. సీఎం పీఠం ఎక్కుతాననుకున్న శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లారు. దీంతో ఇక, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు పరిస్థితి ఏమిటి? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. వాస్తవానికి అన్నాడీఎంకేలో మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళ పంచన చేరిపోయారు. వారంతా చిన్నమ్మకే మద్దతిస్తున్నట్టు ప్రకటించేశారు. అంతేకాదు, వీరి సంతకాలతో కూడిన లేఖను శశికళ గవర్నర్ విద్యాసాగరరావుకి కూడా అందజేసింది. అయినప్పటికీ.. సుప్రీం కోర్టు కేసు చూపుతూ అప్పట్లో గవర్నర్ ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు […]
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాలయ్య పవర్ పనిచేసేనా?!
అనంతపురంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కానుంది. ప్రస్తుతం స్థానిక సంస్థల తరఫున ఎమ్మెల్సీ స్థానం టీడీపీ చేతిలో నే ఉంది. మెట్టు గోవింద రెడ్డి స్థానిక సంస్థల తరఫున ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే, ఈయన పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే, స్థానిక సంస్థల్లో టీడీపీకి బలం ఉండడంతో ఈ స్థానంలో ఎవరు నిలబడ్డా గెలుపు ఖాయం. దీంతో టీడీపీలో ఇప్పుడు […]
ఆవేదన, ఆక్రోశానికి గురై … అమ్మ సమాధిని కొట్టిన శశికళ
కలలు కల్లలయ్యాయి. ఇక ఎక్కి కూర్చోవడమే లేటు అనుకున్న సీఎం సీటు పదేళ్లపాటు దూరం జరిగిపోయింది! ఈ పరిణామం ఊహించనైనా ఊహించలేదు దివంగత తమిళనాడు సీఎం జయలలిత నెచ్చెలి శశికళ. అక్రమార్జన కేసులో సుప్రీం తీర్పుకి ఆమె హతాశురాలైంది. అంతేకాదు, ఆమెకు సుప్రీం నుంచి ఊరట కూడా లభించలేదు. నెల రోజుల పాటు విరామం ప్రకటించాలన్న ఆమె అభ్యర్థనకు కూడా సుప్రీం అంగీకరించలేదు. దీంతో చివరాఖరికి కోర్టులో లొంగిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా ఆవేదన, ఆక్రోశానికి […]
ముహూర్తం ఫిక్స్: బాబు కేబినెట్ ప్రక్షాళన మార్చి 1
ఏపీ కేబినెట్లో మార్పులు చేర్పులకు ముహూర్తం ఫిక్సయిపోయింది. గత ఏడాది దసరాకి ముందు నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చంద్రబాబు కేబినెట్ ప్రక్షాళన మార్చి 1న చేస్తారని వెల్లడైంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టీ అమరావతిపై పడింది. ఇక, తన మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి చంద్రబాబు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. తన తనయుడు లోకేష్ కి మంత్రి వర్గంలో సీటు ఖరారైన నేపథ్యంలో ఆయనను ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేయనున్నారు. ఈ […]
అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వారం రోజుల లగ్జరీ ఖర్చెంతో తెలుసా
తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ఉత్కంఠ పరిణామాలతో ఎట్టకేలకు సమసిపోయింది. జయ నెచ్చెలి శశికళ సీఎం పీఠం ఎక్కాలన్న ఆశలు అడియాసలయ్యాయి. ఇక ఇప్పుడు సీఎం పీఠం రేసులో అమ్మ నమ్మినబంటు పన్నీరుసెల్వం వర్సెస్ చిన్నమ్మ నమ్మినబంటు పళనిస్వామి మాత్రమే ఉన్నారు. శశికళకు అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడడంతో రేపోమాపో ఆమెను పోలీసులు అరెస్టు చేయడం ఖాయం. ఇక ఇప్పుడు శశికళకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుంది. పళనిస్వామికి మద్దతు ఇస్తే […]