ఉరకలు వేసే ఉత్సాహంతో రెడీ అవుతున్న ఏపీ టీడీపీ

ప్ర‌పంచంలో వ్యాపారం – సినిమాలు – రాజ‌కీయాలు ఇలా ఏ కీల‌క రంగాలు చూసుకున్నా వార‌స‌త్వం అనేది కామ‌న్‌. వారి తండ్రి, తాత‌ల నుంచి వ‌చ్చిన ఇమేజ్‌ను అందిపుచ్చుకుని వార‌సులు దూసుకుపోయేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఇది ఎప్ప‌టి నుంచో వ‌స్తోందే. కొత్తేం కాదు. ఈ క్ర‌మంలోనే ఏపీలో అధికార టీడీపీలో సైతం ఇప్పుడు మూడో త‌రం రాజ‌కీయ వార‌సులు అధికారం, ప‌ద‌వి కోసం రేసులో దూసుకుపోతున్నారు. ఈ మూడో త‌రం లీడ‌ర్ల‌లో ముందుగా ఏపీ సీఎం నారా […]

బాబుకు షాక్‌:ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న సెగ‌లు రేప‌డం ఖాయం

ఏపీలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ సాక్షిగా అధికార టీడీపీలో పెద్ద లుక‌లుక‌లు స్టార్ట్ అయ్యేలా క‌నిపిస్తున్నాయి. పైకి మాత్రం వాతావ‌ర‌ణం అంతా స‌వ్యంగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తోన్నా లోప‌ల మాత్రం అసంతృప్తి గాలి బుడ‌గ‌లా ఉంద‌ని…అది ఎప్పుడైనా ఢాంన పేల‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మంత్రివ‌ర్గంలో భారీ స్థాయిలో ప్ర‌క్షాళ‌న జ‌ర‌గ‌నుంది. 7 గురు మంత్రుల‌ను త‌పించే బాబు కొత్త‌గా 13 మందిని కేబినెట్‌లోకి తీసుకుంటార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే క్ర‌మంలో పార్టీలో సామాజిక‌వ‌ర్గాలు – ప్రాంతాలు – సీనియారిటీని […]

హైకమాండ్‌కు చేరిన టీ కాంగ్రెస్ పంచాయితీ

తెలంగాణ కాంగ్రెస్‌లో వ‌ర్గ‌పోరు ముదిరిపోయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా అధికారంలోకి రాలేక‌పోయినందుకు ఒక‌ప‌క్క హైక‌మాండ్ తీవ్ర మ‌థ‌న‌ప‌డుతుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి కొంత‌వ‌ర‌కైనా స్వాంత‌న చేకూర్చాల‌నే అభిప్రాయం ఏ ఒక్క‌రిలోనూ క‌నిపించ‌డంలేదు. ఆధిప‌త్య పోరుతో నాయ‌కులు.. ఒక‌డుగు ముందుకు వంద‌డుగులు వెనక్కి వేస్తున్నారు. క‌ల‌సిక‌ట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్ల‌డం మాని,,ఎవరికి వారు త‌మ స్వలాభాన్ని చూసుకుంట‌న్నారు. ముఖ్యంగా పీసీపీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, మాజీమంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడు పార్టీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశమ‌వుతోంది. దీంతో […]

ప‌ళ‌నిపై క‌క్ష సాధింపుల‌కు కేంద్రం స్కెచ్ రెడీ

అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత‌ త‌మిళ‌నాడులో ప‌ట్టు సాధించాల‌ని… మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వాన్ని ముందుంచి తాము వెనక నుంచి చ‌క్రం తిప్పాల‌ని భావించిన కేంద్రం ఆశ‌ల‌కు ప‌ళ‌నిస్వామి రూపంలో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. శాస‌న‌స‌భ‌లో జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో ప‌ళ‌నిస్వామి విజ‌యం సాధించ‌డంతో సైలెంట్ అయిపోయింది. అయితే `ఇంత‌టితో అయిపోలేదు, నిన్ను వ‌దిలిపెట్టేది లేదు` అంటోంది కేంద్రం. ఎంతో కాలం ఆ స్థానంలో కూర్చోలేవు అంటూ పరోక్షంగా హెచ్చ‌రిక‌లు జారీచేస్తోంది. ఆయ‌న గ‌త చ‌రిత్ర‌ను త‌వ్వి.. లొసుగుల‌ను బ‌య‌ట‌కు […]

కోదండ‌రాంపై టీఆర్ఎస్ ” కులాస్త్రం “

తెలంగాణ ఉద్య‌మంలో కీలకంగా వ్య‌వ‌హ‌రించి.. అన్ని వ‌ర్గాల‌ను స‌మైక్యం చేసిన టీజేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాంపై టీఆర్ఎస్ నాయ‌కులు విరుచుకుప‌డుతున్నారు. కోదండ‌రాం ఎదురుదాడితో ప్ర‌భుత్వం డిఫెన్స్‌లో ప‌డిపోయింది. దీని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఆయ‌న `కులం` కార్డును తెర‌పైకి తెచ్చింది. ముఖ్యంగా ఎంపీ బాల్క సుమ‌న్.. కోదండ‌రాం రెడ్డి అని సంబోధించి స‌రికొత్త చర్చకు దారి తీశారు. ప్ర‌స్తుతం దీనిపై తెలంగాణ‌లో విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. దీని వెనుక పెద్ద క‌థే ఉంద‌ని స‌మాచారం. ఒక‌ప‌క్క తాము సేఫ్ సైడ్‌లోకి […]

జగన్ కు రెండెకరాలిచ్చిన ఘట్టమనేని ఫ్యామిలీ

సొంత రాష్ట్రం ఏర్ప‌డినా.. ఇంకా ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ హైద‌రాబాద్ కేంద్రంగానే కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తుండ‌టంపై అటు ప్ర‌జ‌లు.. ఇటు పార్టీ సీనియర్లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అయితే నూత‌న కార్యాల‌య భ‌వనానికి సైలెంట్‌గా శంకుస్థాప‌న జ‌రిగిపోయింద‌ని.. ప‌నులు కూడా మొద‌లయ్యాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వం భూమి ఇవ్వ‌డంపై ఎదురుచూస్తున్నామ‌ని చెప్పిన జ‌గ‌న్‌కు.. ఇంత స‌డ‌న్‌గా భూమి ఎక్క‌డ దొరికింద‌నేది ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు. ఈ భూమి ప్రిన్స్ మ‌హేశ్‌బాబు బంధువు ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావుకు చెందిన‌దిగా తెలుస్తోంది. త‌న‌కు చెందిన […]

ల‌గ‌డ‌పాటి ఇంట్లో పెళ్లి బాజాలు

కొంత‌కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్.. ప్ర‌స్తుతం త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. స‌మైక్య వాదాన్ని పార్ల‌మెంటులో వినిపించిన ఆయ‌న‌.. రాష్ట్రం రెండు ముక్క‌లైతే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించి.. దానికి క‌ట్టుబ‌డి ఉన్న విష‌యం తెలిసిందే! అయితే ప్ర‌స్తుతం ల‌గ‌డ‌పాటి ఇంట్లో పెళ్లి భాజాలు మోగే స‌మ‌యం వ‌చ్చింది. ఆయ‌న ఇద్ద‌రు కుమారుల‌కు ఒకేసారి ఎంగేజ్‌మెంట్ వేడుక ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు హైదరాబాద్‌లోని పార్క్ హ‌య‌త్ వేదిక కాబోతోంది. […]

ఆ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా లోకేష్ పోటీ..!

ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో భాగం చేయడానికి మరో ముందడుగు పడింది. లోకేష్‌ను మంత్రిని చేయ‌డం దాదాపు ఖ‌రారైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే లోకేష్‌ను ఎమ్మెల్యేల కోటాలో మండ‌లికి పంపుతార‌నే అంద‌రూ అనుకున్నారు. అయితే చంద్ర‌బాబు మాత్రం లోకేష్‌ను ఓ జిల్లా స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీకి పంపాల‌ని డిసైడ్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఏపీలో టీడీపీ తిరుగులేని […]

వాళ్ల ఫైటింగ్‌తో బాబుకు నిద్ర ప‌ట్ట‌డం లేదా..!

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ వేళ‌.. సీఎం చంద్ర‌బాబు స‌రికొత్త టెన్ష‌న్ మొద‌లైంది. పైకి అంతా బాగానే క‌నిపిస్తున్నా.. కర్నూలు జిల్లాలో మాత్రం ప‌రిస్థితులు నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్నాయి. ఈసారి విస్త‌ర‌ణ‌లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నంధ్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డికి చోటు ద‌క్క‌వ‌చ్చనే ప్రచారం పార్టీ వ‌ర్గాల్లో జోరుగా జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో భూమా చేరిక‌ను తొలి నుంచి వ్య‌తిరేకిస్తున్న శిల్పా వ‌ర్గం.. వైసీపీలో చేర‌వ‌చ్చ‌చే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో […]