సీమ‌లో వైసీపీకి షాక్‌… మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే త‌మ్ముడు జంప్‌

ఏపీలో 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని విస్తృతంగా ప్ర‌య‌త్నిస్తున్న విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతోంది. నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవ‌డంతో ఆయ‌న‌కు ఏం చేయాలో దిక్కు తోచ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, ఇప్పుడు కొద్దో గొప్పో బ‌లంగా ఉన్న నేత‌లు, నియోజ‌క‌వ‌ర్గాలు సైతం జ‌గ‌న్ చేయి జారిపోతున్నాయ‌నే వార్త‌లు ఊపందుకున్నాయి. ముఖ్యంగా సీమ‌లో వైసీపీకి పెట్ట‌ని కోట‌లుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల నుంచి కూడా జ‌గ‌న్‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌నే వార్త‌లు […]

టీఆర్ఎస్ ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే మ‌ధ్య‌లో లేడీ

తెలంగాణ‌లో కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన ఖ‌మ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే మ‌ధ్య జ‌రుగుతోన్న పోరులో పార్టీ కార్య‌క‌ర్త‌లు న‌లిగిపోతున్నారు. అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఇద్ద‌రూ త‌మ పంతం నెగ్గించుకునేందుకు ఎత్తుకు, పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఖ‌మ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బాణోతు మ‌ద‌న్‌లాల్‌, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇద్ద‌రూ వైసీపీ నుంచి గెలిచారు. వైసీపీలో ఉన్న‌ప్పుడు, గ‌త ఎన్నిక‌ల్లోను వీరిద్ద‌రి మ‌ధ్య ఎంతో స‌ఖ్య‌త ఉండేది. అయితే వీరు తెలంగాణలో […]

విశ్వేశ్వ‌ర్‌రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది…2019లో గెలుస్తాడా?

అనంతపురం జిల్లాలోని వెన‌క‌బ‌డిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్ ప‌య్యావుల కేశ‌వ్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు ఓడిపోవ‌డం విశేషం. విచిత్రం ఏంటంటే కేశ‌వ్‌పై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వ‌ర్‌రెడ్డి 2004లో సీపీఐ నుంచి, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి గ‌త ఎన్నిక‌ల్లో మూడోసారి పార్టీ మారి ఈ సారి వైసీపీ నుంచి పోటీ చేసి కేశ‌వ్‌పై ఎట్ట‌కేల‌కు 2275 ఓట్ల స్వ‌ల్ప ఓట్ల […]

టీడీపీలో పురుష ఎమ్మెల్యే వ‌ర్సెస్ మ‌హిళా ఎమ్మెల్యే మ‌ధ్య వార్

ఏపీలో అధికార టీడీపీలో పురుష ఎమ్మెల్యే వ‌ర్సెస్ మ‌హిళా ఎమ్మెల్యే మ‌ధ్య వార్ జ‌రుగుతోంది. అధికార పార్టీకే చెందిన ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పంతానికి పోవ‌డంతో ఇప్పుడు అధిష్టానానికి పెద్ద చిక్కే వ‌చ్చిపడింది. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీకి ప్ర‌జ‌ల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దీంతో 48 వార్డుల్లో 35 చోట్ల టీడీపీ సైకిల్ జోరు సాగింది. ఇక‌, మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ల ఎన్నిక ప‌రోక్షం కావ‌డంతో అధికారులు ఇప్ప‌టికే నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16 […]

కేసీఆర్‌, బాబుల‌కు చిచ్చు పెట్టిన ఐల‌య్య

ప్ర‌ముఖ విద్యావేత్త,  ప్రొఫెస‌ర్ కంచె ఐల‌య్య షెఫ‌ర్డ్‌.. ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో నిలుస్తున్నారు. నిజానికి ఆయ‌న వివాదం లేక‌పోతే.. నాగురించి ఎవ‌రు ప‌ట్టించుకుంటారు? అని అనుకుంటారో ఏమో?  ఆయ‌న ఎప్పుడు వార్త‌ల్లోకి వ‌చ్చినా వివాదంతోనే ఉంటారు. ఈ వివాదాలు రానురాను ప్ర‌భుత్వాల‌ను తెగ ఇరుకున పెడుతున్నాయి. ఈ విష‌యాన్ని ఆయ‌న గ‌మ‌నించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాజ‌కీయ నేత‌లు పేర్కొంటున్నారు. విజ్ఞులు, మేధావులు అయిన వాళ్లే.. త‌మ త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌చారం కోసం వివాదాల‌ను ప్రోత్స‌హించ‌డం […]

తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా.. నాగ్ తీరేవేరు!

సినీ మన్మ‌థుడు అక్కినేని నాగార్జున తీరు చాలా విచిత్రంగా ఉంది. పొలిటిక‌ల్‌గా ఆయ‌న ఓ రేంజ్‌లో గేమ్ ఆడేస్తున్నారు. ఫ‌క్తు రాజ‌కీయ నేత‌ల‌ను సైతం ఆయ‌న మించిపోతున్నాడని అంటున్నారు విశ్లేష‌కులు. అస‌లేం జ‌రిగిందో చూద్దాం. నాగార్జున‌కు వార‌స‌త్వంగా వ‌చ్చిన వ్యాపారాలు స‌హా ఆయ‌న ప్రారంభించిన వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉండ‌గానే అవి ప్రారంభం కావ‌డంతో కొన్ని హైద‌రాబాద్‌, కొన్నింటిని విజ‌య‌వాడ‌, విశాఖ‌ల్లోను ఏర్పాటు చేశారు. అయితే, త‌ర్వాత రాష్ట్రం విడిపోయింది. దీంతో ఆ ఆస్తులు […]

`సేమ్ టుసేమ్` జ‌న‌సేన‌ను దించేశారుగా!

రాజ‌కీయాల్లో కొత్త పార్టీల‌కు కొద‌వే లేదు. కొన్ని పార్టీల పేర్లు చిత్ర‌విచిత్రంగా ఉంటాయి. బాగా పాపుల‌ర్ అయిన పార్టీల పేర్ల‌కు ముందు, వెనుక ఒక ప‌దం జోడించి.. కొత్త పార్టీగా పెట్టేస్తుంటారు! ఇప్పుడు ఇలాంటి విచిత్ర‌మే త‌మిళ‌నాడులో జ‌రిగింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన‌కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే! అలాగే త‌మిళ‌నాడులో `అమ్మ‌` పేరుకు ఎంతో పాపులారిటీ ఉంది. ఈరెండు ప‌దాల‌నే క‌లిపి ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఇంకో విశేషమేంటం టే.. […]

తెలంగాణ‌లో నంద్యాల త‌ర‌హా ఉప ఎన్నిక‌

త్వరలోనే తెలంగాణలోనూ నంద్యాల లాంటి పోరు తప్పేలా లేదు. ఉప ఎన్నికల స్పెషలిస్ట్‌ పార్టీగా గుర్తింపు పొందిన గులాబీ పార్టీ… త‌న స‌త్తా చాటేందుకు మరోసారి అదే దారి ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. కేసీఆర్ సీఎం అయ్యాక ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ఎంపీ స్థానాల‌కు, రెండు ఎమ్మెల్యే స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూడా టీఆర్ఎస్ వార్ వ‌న్‌సైడ్ చేసేసింది. ఇక పాలేరు, ఖేడ్ అసెంబ్లీ స్థానాల‌తో […]

నిమ్మ‌ల రాయానాయుడు గ్రాఫ్ ఎలావుంది?.. 2019 గెలుపుపై ఏంచెప్పుతుంది!

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా డెల్టాలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గం పాల‌కొల్లు. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన నిమ్మ‌ల రామానాయుడు ముక్కోణ‌పు పోటీలో విజ‌యం సాధించారు. 1955లో ఆవిర్భ‌వించిన ఈ నియోజ‌క‌వ‌ర్గం 1983 వ‌ర‌కు కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి 2009లో మిన‌హా మిగిలిన అన్ని ఎన్నిక‌ల్లోను టీడీపీయే విజ‌యం సాధించింది. టీడీపీకి నియోజ‌క‌వ‌ర్గం పెట్ట‌ని కోట‌. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మ‌ల రామానాయుడు ఈ మూడున్న‌రేళ్ల‌లో ఏం చేశారు ? ఏం […]