అవును! జగన్ మారితేనో లేదా ఆయన వ్యూహం మార్చుకుంటేనో తప్ప ఏపీలో ప్రధాన విపక్షంగా ఉన్న వైసీపీకి మనుగడ ఉండదని అంటున్నారు విశ్లేషకులు. 2019లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి వచ్చి తీరాలని గట్టి పట్టుమీదున్న వైసీపీ అధినేత జగన్.. దానికి అనుగుణంగా తన తీరును, పార్టీ నడవడికను మార్చి తీరాలని చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీలో అంతా తానై వ్యవహరిస్తున్న ప్రస్తుత విధానానికి తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా సూచిస్తున్నారు. నిజానికి జగన్ 2014లోనే అధికారంలోకి రావాల్సి […]
Category: Politics
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్: చింతల రామచంద్రారెడ్డి (ఖైరతాబాద్)
గ్రేటర్ హైదరాబాద్‌లో అది ఖరీదైన ఏరియాల్లో విస్తరించి ఉన్న నియోజకవర్గం ఖైరతాబాద్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నియోజకవర్గం అయిన ఖైరతాబాద్ పునర్విభజనలో నాలుగు చెక్కలు అయ్యింది. ఇక సీఎం క్యాంప్ ఆఫీస్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ నియోజకవర్గంలోనే రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ రాజ్‌భవన్ నివాసం ఉంది. అతి ఖరీదైన బంజారాహిల్స్, జూబ్లిహిల్స్‌లు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో పేరున్న స్టార్ హోటల్స్‌కు, అతి ఖరీదైన మాల్స్‌కు ఇది కేంద్రం. అలాగే 120 నిరుపేద బస్తీలు […]
కేసీఆర్ వ్యూహానికి అడ్డుగా రేవంత్
తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మధ్య వార్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! సందర్భమేదైనా.. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అంటారు రేవంత్! మరోసారి వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన మొదలైంది. ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాల్లో కేసీఆర్‌ను మించిన వారు లేరనే విషయం తెలిసిందే! వీటిని పసిగట్టలేని ప్రతిపక్షాలు ఆయన ఉచ్చులో పడిపోవడం పరిపాటిగా మారింది. అయితే తొలిసారి కేసీఆర్‌కు షాక్ తగలబోతోందట. ఆయన వ్యూహానికి రివర్స్ కౌంటర్ […]
కేసీఆర్ వ్యూహానికి గుత్తా బలవుతున్నారా?
కొందరి వ్యూహాలు మరికొందరికి శాపంగా పరిణమిస్తుంటాయి. అయినా ఏం చేస్తారు? టైం బ్యాడ్ అనుకుని సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ చైతన్యం ఉన్న నల్లగొండ జిల్లా కు చెందిన కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుతం టీఆర్ ఎస్ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి పరిస్థితి కూడా ఇలానే ఉందట. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు తట్టిన వ్యూహానికి గుత్తా బలైపోతున్నారట. ఇప్పుడు ఈ విషయంలో స్టేట్ […]
ఈ డబుల్ గేమ్ తో పంచ్ పడేది ఎవరికి!
రాజకీయాలన్నాక కూసింత లౌక్యం మంచిదే, కానీ అది ముదిరితేనే ప్రమాదం. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు బీజేపీ గురించే అంటున్నారు తెలంగాణలోని రాజకీయ పండితులు. తమకు తామే మేధావులమని, తమను మించిన వారు లేనేలేరని, పాలనా దక్షత మాకే ఉందని ఇటీవల కాలంలో ఆగకుండా అందకుండా డప్పు బజాయిస్తున్న బీజేపీ నేతలు, తెలంగాణలో అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చినా ఇక్కడి టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఢిల్లీ […]
చంద్రబాబును ముంచేస్తున్న ట్రాన్స్‌స్ట్రాయ్
పోలవరం.. పోలవరం.. పోలవరం.. ఏపీ సీఎం చంద్రబాబు నిత్యం వల్లెవేసే పదం! పోలవరం ఏపీ జీవనాడి అని సందర్భం దొరికినప్పుడల్లా చెబుతూ ఉంటారు! పోలవరం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తిచేయాలని పదేపదే అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపే అని తేలిపోయింది. పోలవరం కాంట్రాక్టు పనులు దక్కించుకున్న ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ.. ఇప్పుడు చంద్రబాబును పూర్తిగా ముంచేసింది. పోలవరం పనుల్లో తీవ్ర జాప్యం ఇప్పుడు చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తోంది. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందో లేదో […]
కేసీఆర్‌కి కోపమొచ్చింది.. ముగ్గురు మంత్రులపై ఫైర్!
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పట్టలేని ఆగ్రహం వచ్చిందని టీఆర్ ఎస్ భవన్ కోడైకూస్తోంది! ఆ ఆగ్రహం కూడా ఏదో అధికారుల మీదో.. పార్టీ కార్యకర్తలమీదో కాదట. ఏకంగా తన కేబినెట్‌లోని కీలక శాఖలు చూస్తున్న మంత్రుల పైనేనట. ముఖ్యంగా ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో ఓ ముగ్గురు మంత్రులపై గులాబీ దళపతి సీరియస్ అయ్యారని, `తిని కూర్చుంటే ఎలా` అని ఖసురు కున్నారని కూడా తెలుస్తోంది. దీంతో ఆ ముగ్గురు తీవ్రంగా హర్ట్ అయ్యారని అంటున్నారు నేతలు. […]
జగన్ తో పెద్దాయన డీల్ షురూ! ఇక కండువా మారుడే!
వైఎస్ ఆత్మ కేవీపీ ఇక, జగన్ చెంతకు చేరనున్నారా? త‌్వరలోనే కాంగ్రెస్‌కు రాం రాం పలకనున్నారా? ఏపీలో జగన్‌ను సీఎం చేయడమే ధ్యేయంగా ఆయన వైసీపీ ని ముందుండి నడిపిస్తారా? ఇప్పటికే దీనికి సంబంధించిన డీల్ కుదిరిపోయిందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది లోటస్ పాండ్ వర్గాల నుంచి. విషయంలోకి వెళ్తే.. 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి వచ్చి తీరాలని నిర్ణయించుకున్నాడు జగన్. ఈ క్రమంలో ఆయన బిహార్ నుంచి ఎన్నికల సలహాదారుగా ప్రశాంత్ కిశోర్‌ని […]
వైసీపీ నేతలకు జగన్ మాటంటే లెక్కేలేదా..
ఒక్క విజయం బంటును రాజును చేస్తుంది. అదే ఒక్క అపజయం.. రాజును బంటు కన్నా హీనమైన స్థితికి దిగజార్జేస్తుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత, లోటస్ పాండ్ వర్గాలు గౌరవంగా పిలుచుకునే `కాబోయే సీఎం` వైఎస్ జగన్ పరిస్థితి బంటుకన్నా హీనంగా తయారైందని తెలుస్తోంది. 2014లో ఎదురైన పరాభవం పక్కన పెడితే… ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్‌లలో వైసీపీ ఘోరంగా నేలకు కరుచుకోవడంతో జగన్ ఇమేజ్ జనాల్లో కన్నా పార్టీ నేతల్లో పూర్తిగా డ్యామేజ్ […]