న‌ల్గొండ ఉపపోరులో టీఆర్ఎస్‌-కాంగ్రెస్‌-బీజేపీ-టీడీపీ అభ్య‌ర్థులు వీళ్లేనా..!

తెలంగాణ రాజ‌కీయాల‌ను కొద్ది రోజులుగా ఉడికిస్తోన్న న‌ల్గొండ ఎంపీ సీటు ఉప ఎన్నిక‌కు రంగం సిద్ధ‌మైన‌ట్టే క‌నిపిస్తోంది. నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికను ఆహ్వానించాలని పక్కాగా నిర్ణయించుకున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, అందుకు తగిన రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో రాజీనామా చేయించగానే ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవుతుందనే అంచనాలో ఉన్న ఆ పార్టీ ఇప్ప‌టికే అక్క‌డ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను స్పీడ‌ప్ చేసే ప‌నిలో ఉంది. న‌ల్గొండ ఎంపీ సీటు ప‌రిధిని మొత్తం […]

మోడీ అస‌లు రూపం..ఇప్పుడే బయటపడిందా..!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అస‌లు రూపం బ‌ట్ట‌బ‌య‌లైంది. 2014లో రాసుకుని, పూసుకుని తిరిగి.. ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం చేయించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆయ‌న గ‌డ్డి ప‌ర‌క‌లా ప‌క్క‌న పెట్టేశారు. ప‌ట్టుమ‌ని మూడేళ్లు కూడా తిర‌గ‌కుండానే.. ఒకే వేదిక‌ను పంచుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన నేత‌ను నిలువునా అవ‌మానించారు. అసలు ఏపీలో ప‌వ‌న్ అనే వ్య‌క్తి ఉన్నాడ‌న్న త‌లంపు కూడా లేకుండా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా స్వచ్ఛతే సేవ.. కార్య‌క్ర‌మం జోరుగా సాగుతోంది. అక్టోబ‌రు 2 గాంధీ జ‌యంతి వ‌ర‌కు ఇది […]

లండ‌న్‌లో జ‌గ‌న్‌…వైసీపీలో అంతా టెన్ష‌న్ టెన్ష‌న్‌

ప్ర‌స్తుతం రాజ‌కీయ నేత‌ల దృష్టి అంతా జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యేల‌పైనే ప‌డింది. ఇటీవ‌ల జ‌రిగిన నంద్యాల, కాకినాడ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవ‌డం, ప్ర‌జ‌ల్లో సింప‌తీ లేద‌ని తేలిపోవ‌డంతో ప్ర‌స్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు త‌ట్టా బుట్టా స‌ర్దు కుంటార‌ని అంటున్నారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవ‌ల చేస్తున్న వ్యాఖ్య‌లు బ‌లం చేకూరుస్తున్నాయి. తొలుత ఆరుగురు ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని చెప్పిన ఆయ‌న తాజాగా నిన్న మాట్లాడుతూ.. క‌నీసం 12 మంది ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని సిగ్న‌ల్ […]

ఏపీలో మేక‌ప్‌.. ప్యాక‌ప్‌! ఇక‌.. ద‌ర్శ‌కుల పాల‌న‌.. !

అవును! ఏపీలో చంద్ర‌బాబు త‌న పాల‌న‌ను ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీకి అప్ప‌గించే ప‌నిలో ప‌డ్డారు. అంత‌ర్జాతీయ స్థాయిలో నిర్మించాల‌ని భావిస్తున్న ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఇప్ప‌టికే ఓ క్లారిటీకి వ‌చ్చేసిన చంద్ర‌బాబు.. దాని డిజైన్ల‌ను ఖ‌రారు చేయ‌డం త‌న వ‌ల్ల‌కాద‌ని చేతులు ఎత్తేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సినీ ద‌ర్శ‌క దిగ్గ‌జంగా అవ‌త‌రించిన బాహుబ‌లి రాజ‌మౌళిని ఆశ్ర‌యించారు. ఆయ‌న డైరెక్ష‌న్‌లో అమ‌రావ‌తి డిజైన్ల‌ను ఖ‌రారు చేయాల‌ని ఐఏఎస్ సీనియ‌ర్ అధికారులు స‌హా మంత్రి నారాయ‌ణ‌ను సైతం […]

కృష్ణాలో చంద్ర‌బాబుకు షాక్‌.. వల్లభనేని వంశీ నిర‌స‌న‌

ప్ర‌భుత్వంపై అధికార పార్టీ ఎమ్మెల్యే నిర‌స‌న‌కు దిగారు! భ‌ద్ర‌త పెంచాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నా కనీసం ప‌ట్టించు కోక‌పోవ‌డంపై ఆందోళ‌న చెందుతున్నారు. ప్ర‌భుత్వం వ‌చ్చాక త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచే శారు. మూడేళ్లు స‌హ‌నంతో ఎద‌రుచూసిన ఆయ‌న.. ఇక నిర‌స‌న మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వం త‌న‌కు క‌ల్పించిన గ‌న్‌మెన్ల‌ను స‌రెండ‌ర్ చేసి త‌న అసంతృప్తి, ఆవేద‌న‌ను ప్ర‌భుత్వానికి తెలియ‌జేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే, టీడీపీకి బాగా ప‌ట్టున్న కృష్ణాజిల్లాలో ఇలాంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. […]

ఇర‌కాటంలో క‌విత‌…రంగంలోకి కేటీఆర్‌

తెలంగాణ‌ సీఎం కేసీఆర్ కూతురు క‌విత ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నిజామాబాద్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆమెను ఇర‌కాటంలో ప‌డేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని టీఆర్ఎస్‌కు చెందిన కీల‌క‌నేత త‌న‌యుడు ప్ర‌త్య‌ర్థి కారుదిగి కాషాయ కండువా క‌ప్పుకోవ‌డంతో రాజ‌కీయాలు హీటెక్కాయి. అంతేగాక బీజేపీ పెద్ద‌లు కూడా.. నిజామాబాద్‌నే టార్గెట్ చేయ‌డంతో.. ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మ‌రి చెల్లి ఇన్ని క‌ష్టాల్లో ఉంటే.. అన్న కేటీఆర్‌ ఊరుకుంటాడా? వెంట‌నే అభ‌య‌హ‌స్తం ఇచ్చేశాడు. చెల్లిని స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌పడేసేందుకు త‌న వంతు స‌హాయ స‌హ‌కారాలు […]

ఆ ఫ్యామిలీ కోసం టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ…బంప‌ర్ ఆఫ‌ర్‌

ఏపీలో రాజకీయంగా బాల‌మైన ఫ్యామిలీని త‌మ వైపున‌కు తిప్పుకునేందుకు అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ హోరాహోరీగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ ఫ్యామిలీ త‌మ పార్టీలో చేరితే బంప‌ర్ ఆఫ‌ర్లు కూడా ఇస్తున్నాయి. అధికార టీడీపీ ఆ ఫ్యామిలీకి ఓ ఎంపీ సీటుతో పాటు మ‌రో ఎమ్మెల్యే సీటు ఇస్తే, విప‌క్ష వైసీపీ ఏకంగా రెండు ఎమ్మెల్యే సీట్ల‌తో పాటు ఓ ఎంపీ సీటు ఆఫ‌ర్ చేసింద‌ట‌. ఓవ‌రాల్‌గా ఈ ఫ్యామిలీని త‌మ వైపున‌కు తిప్పుకునేందుకు ఈ రెండు […]

టీఆర్ఎస్‌లో ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టిక్కెట్ క‌ట్‌

తెలంగాణ‌లో జెట్ రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతోన్న సీఎం కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లేందుకు రెడీగా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఓ ఆరేడు నెల‌ల ముందుగానే ఎన్నిక‌లకు వెళ్లాల‌ని భావిస్తోన్న ఆయ‌న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోను మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల ప‌నితీరుపై ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు చేయించుకుంటున్నారు. చాలా వీక్‌గా ఉన్న వారిలో మంత్రులు ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు ఉన్నా వారిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిర్దాక్షిణ్యంగా ప‌క్క‌న పెట్టేసి కొత్త‌వారికి సీట్లు ఇచ్చేందుకు ఇప్ప‌టికే ఓ పెద్ద […]

ఇలా అయితే క‌మ‌లం విక‌సించ‌డం క‌ష్ట‌మే!

ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందుకు వెళుతున్న బీజేపీకి.. ఏపీ ద‌గ్గ‌ర బ్రేక్ ప‌డింది. ఏ రాష్ట్రం విష‌యం లోనూ ఇంత గంద‌ర‌గోళ ప‌డ‌ని అధిష్టానం.. ఏపీలో ఎలా ముందుకువెళ్లాలో తెలియ‌క తికమ‌క ప‌డుతోంద‌ట‌. స్ప‌ష్ట‌మైన వ్యూహాల‌తో.. ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తుచేసే బీజేపీ పెద్ద‌ల‌కు.. ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి ప‌డింద‌ట‌. ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు రాబోతున్న త‌రుణంలో.. ఏపీ బీజేపీ నాయ‌కులు కొన్ని అంశాల్లో స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని అధిష్టానాన్ని కోరుతున్నార‌ట‌. ఏ పార్టీతో స‌మ‌న్వ‌యంతో ముందుకు వెళ్లాలి? సొంతంగా […]