టిక్కెట్ రాద‌న్న డౌట్‌… టీడీపీ ట‌చ్‌లో వైసీపీ ఎమ్మెల్యే…!

ఆయ‌న‌కు ప్ర‌జాభిమానం ఎక్కువ‌. గ‌త ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీ సాధించి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఎంత అంటే.. ఏకంగా సీఎం జ‌గ‌న్‌కు స‌రిస‌మాన‌మైన మెజారిటీతో విజ‌యం సాధించారు. ఆయ‌నే ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని గిద్ద‌లూరు ఎమ్మెల్యే.. అన్నారాంబాబు. అయితే.. ఆయ‌న ఇంత ప్ర‌జాభిమానం ద‌క్కించుకున్నా.. పార్టీలో ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎవ‌రూ ఆయ‌నను ఖాత‌రు చేయ‌డం లేదు. క‌నీసం.. అధిష్టానం అయినా.. ఆయ‌న‌ను పట్టించుకుంటోందా? అంటే అది కూడా క‌నిపిం చ‌డం లేదు. దీనికి కార‌ణం.. ఆయ‌న నోటి […]

చింత‌ల‌పూడి వైసీపీ టిక్కెట్ రేసులో విజ‌య‌రాజు…?

ఏపీలో ఎన్నిక‌ల‌కు గ‌ట్టిగా యేడాది మాత్ర‌మే టైం ఉన్న‌ట్టు లెక్క‌. ఎన్నిక‌ల చివ‌రి యేడాది అంతా రాజ‌కీయ యుద్ధ‌మే న‌డుస్తుంది. ఇక ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలోనూ అన్ని పార్టీల్లో ఆశావాహుల హ‌డావిడి మామూలుగా లేదు. అధికార వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా… దాదాపు 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా చేయించిన స‌ర్వేలో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. వీరిలో చాలా మందిని ప‌క్క‌న పెట్టేసి కొత్త‌వాళ్ల‌తోనే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని జ‌గ‌న్ డిసైడ్ […]

ఆ అసెంబ్లీ సీటుపై ఖ‌ర్చీఫ్ వేసిన బాల‌య్య చిన్న‌ల్లుడు…!

తెలుగుదేశం పార్టీలో బాలయ్య చిన్నలుడు రాజ‌కీయం వ‌చ్చే ఎన్నిక‌ల వేళ స‌రికొత్త‌గా మార‌నుంది. ఇటు బాల‌య్య‌కు చిన్న‌ల్లుడిగా ఉన్న మెతుకుమిల్లి శ్రీ భ‌ర‌త్ విశాఖ మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తికి, అటు మ‌రో కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబ‌శివ‌రావుకు కూడా మనవడే. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా భ‌ర‌త్ రాజ‌కీయాల్లో బాల‌య్య అల్లుడిగానే ఐడెంటీ అవుతున్నాడు. ఓ వైపు తెలుగుదేశంలో బాల‌య్య పెద్ద‌ల్లుడు భ‌ర‌త్ తోడ‌ల్లుడు లోకేష్ ఓ రేంజ్‌లో చ‌క్రం తిప్పుతున్నాడు. […]

పేర్ని నానికి ఈ సారి జ‌గ‌న్ టిక్కెట్ ఇవ్వ‌రా…రీజన్ ఇదేనట ?

కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గ‌త కొంత కాలంగా బంద‌రు ఎంపీ వల్లభనేని బౌలశౌరిని మాజీ మంత్రి బందరు ఎమ్మల్యే పేర్ని నాని మ‌ధ్య నివురుగ‌ప్పిన నిప్పుల్లా ఉన్న విబేధాలు ఇప్పుడు మ‌రింత తీవ్రం అయ్యాయి. రెండు రోజుల క్రింద‌ట త‌న ఎంపీ ల్యాడ్స్ నిధుల‌తో జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన ఎంపీ బాల‌శౌరిని ఎమ్మెల్యే వ‌ర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీ తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోవ‌డంతో పాటు పేర్ని నానిని టార్గెట్‌గా చేసుకుని మాట్లాడారు. వీరిద్ద‌రు కాపు […]

తెగించైనా వంశీని ఓడిద్దాం అంటున్న వైసీపీ…!

పార్టీ మారిన టిడిపి రెబల్ ఎంపీ వల్లభనేని వంశీకి అధికార పార్టీ వైసీపీలో ముందు నుయ్యి వెనక గొయ్యి మాదిరిగా పరిస్థితి వుంది. టిడిపి నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ ని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న జగన్ అప్పటివరకు గన్నవరం నియోజకవర్గంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నేతలను సంతృప్తి పరచలేకపోతున్నారు . దీంతో గన్నవరంలో వైసిపి రాజకీయం ప్రతి రోజు రగులుతూనే ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సార్లు వంశీకి వైసీపీలో వంశీ ప్రత్యర్థులుగా ఉన్న నేతలకు మధ్య […]

టీఆర్ఎస్‌లోకి దిల్ రాజు… అక్క‌డ నుంచే పోటీ…?

తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలంగాణ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి ఇది కొత్త న్యూస్‌ కాదు. ఆయ‌న‌ గత ఎన్నికలకు ముందే అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారన్న గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు దిల్ రాజు వ్యాపారపరంగా మరింత ముందుకు దూసుకు పోయారు. ఈ క్రమంలోనే ఆయన చూపు వచ్చే ఎన్నికలపై పడినట్టు తెలుస్తోంది. […]

పార్టీ మారుతోన్న వంగ‌వీటి… వంశీతో భేటీ వెన‌క క‌థ ఇదే..!

ఇప్ప‌టికే ప‌లు పార్టీలు మారుతూ వ‌చ్చి ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రంగా కుమారుడు రాధా మ‌రోసారి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారా ? ఆయ‌న మ‌ళ్లీ త‌న పాత పార్టీ వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారా ? అంటే తాజాగా బెజ‌వాడ రాజ‌కీయ ప‌రిణామాలు గ‌మ‌నిస్తుంటే అవును అన్న ఆన్స‌ర్లే వినిపిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలోని గన్నవరంలో వైసీపీ మద్దతుదారుడు అయిన‌ టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వంగవీటి రాధా రహస్యంగా భేటీ అయ్యారు. వీరిద్ద‌రు […]

వైసీపీలో పక్క చూపులు చూస్తోంది వీళ్లేనా..?

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికలలో ఎలాగైనా జగన్ ను ఓడించాలని .. ఓవైపు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా ఈసారి పొత్తుల తోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. దీంతో టిడిపిలో చేరే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మరోవైపు అధికార పార్టీలో లోడింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మంది నేతలు ఎలాంటి పదవులు లేక […]

రేవంత్ జోరు.. మ‌రో అభ్య‌ర్థి ఖ‌రారు.. సీనియ‌ర్ల బేజారు..!

కాంగ్రెస్ పార్టీ అవ‌ల‌క్ష‌ణాల‌న్నీ రేవంతుకూ ప‌ట్టుకున్నాయా..? పార్టీ బాధ్య‌త‌లు చేప‌ట్టి ఏడాద‌వుతున్నా త‌న ఒంటెత్తు పోక‌డ మార్చుకోవ‌డం లేదా.? త‌న దూకుడు నిర్ణ‌యంతో మ‌రో అభ్య‌ర్థిని ఖ‌రారు చేశారా..? దీంతో సీనియ‌ర్లు మ‌రోసారి రేవంతుపై గుర్రుగా ఉన్నారా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానాలు ఇస్తున్నాయి. రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వ‌డ‌మే పార్టీలో చాలా మంది సీనియ‌ర్ల‌కు ఇష్టం లేదు. అయినా అధిష్ఠానం రేవంతుకే ఆ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌రుస‌టి […]