తమిళనాడు రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయా? దక్షిణాదిలో కేవలం కర్ణాటక, ఏపీలతోనే సరిపెట్టుకున్న బీజేపీ.. ఇప్పుడు తాజాగా తమిళనాడులోనూ పాగా వేసేందుకు పావులు కదుపుతోందా? ఆ దిశగా ప్రధాని మోడీ చేసిన ప్రయత్నాలు ఫలించాయా? ఆయనకు తమిళనాడు మాజీ సీఎం, అమ్మకు విధేయుడు పన్నీర్ సెల్వల మధ్య పొత్తు విషయంలో రాజీకుదిరిందా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. దీనికి ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న పన్నీర్.. పెట్టిన ట్వీటే పెద్ద సాక్ష్యం. అయితే, ఆయన ప్రజాగ్రహానికి గురవ్వాల్సి […]
Category: Latest News
జనసేనలో సామాన్యులకు చోటు లేదా?!
ఏపీలో నూతన పార్టీ జనసేన చుట్టూ ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. గడిచిన వారం రోజులుగా ఈ పార్టీ కార్యకర్తలకు ఆహ్వానం పలుకుతోంది. అంతేకాదు, జనసేనలో కీలక పోస్టుల నియామకం కూడా చేస్తోంది. దీనికిగాను ఎంట్రీ టెస్ట్‌లు నిర్వహించడం బహుశ దేశంలో ఇదే తొలిసారి కావొచ్చు. ఏ పార్టీ కూడా ఇంత రేంజ్లో ఎంట్రీ టెస్ట్‌లు పెట్టి కార్యకర్తలను, నేతలను నియమించిన సందర్భాలు లేవు. నిజానికి ఐఏఎస్ చదివి.. ఉద్యోగానికి రిజైన్ చేసి లోక్‌సత్తా స్థాపించిన జేపీ […]
బోండా ఉమాపై బాబు చర్యలు ఖాయమా?
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, టీడీపీ ఫైర్ బ్రాండ్‌గా ఎదగాలని ప్రయత్నిస్తున్న బోండా ఉమా మహేశ్వరరావు.. ఉరఫ్ బోండా ఉమా..కి పొలిటికల్‌గా మూడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రేపో మాపో ఆయనపై బాబు వేటు వేయడం ఖాయమని తెలుస్తోంది. ఇటీవల కాలంలో బోండా ఉమా హద్దు మీరుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎంపీ నాని అండ చూసుకుని రెచ్చిపోతున్నారని కూడా తెలుస్తోంది. ఆర్టీఏ గొడవే దీనికి ప్రధాన ఉదాహరణ. ఆర్టీఏ కమిషనర్ సెక్యూరిటీని ఉమా బలంగా నెట్టడం అందరికీ తెలిసిందే. ఇక, […]
ఆ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఆశలపై చంద్రబాబు నీళ్లు
ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ విజయంలో పశ్చిమగోదావరి జిల్లా పోషించిన పాత్రకు వెలకట్టలేం. ఈ జిల్లాలో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ స్థానాలన్నింటిలోను టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. అయితే ఈ జిల్లాలో వరుసగా రెండుసార్లు గెలిచిన వచ్చే ఎన్నికల్లో మూడోసారి గెలిచిన హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోన్న ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేకు చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో షాక్ ఇస్తారన్న వార్తలు వెస్ట్ పాలిటిక్స్‌లో పెద్ద సంచలనంగా మారాయి. శశి విద్యాసంస్థలకు చెందిన బూరుగుపల్లి శేషారావుకు 2009లో […]
ఏపీలో జనసేనతో కొత్త ఫ్రంట్
2019 ఎన్నికలు తెలంగాణలో కంటే ఏపీలో రసకందాయంగా ఉండేలా కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎంత గ్యాప్ ఉన్నా మరోసారి అధికార కూటమి అయిన టీడీపీ+బీజేపీ కూటమి కలిసి పోటీ చేయడం కన్ఫార్మ్గా కనిపిస్తోంది. విపక్ష వైసీపీ అధినేత జగన్ మోడీని కలిసిన నేపథ్యంలో వైసీపీ, బీజేపీ పొత్తు ఉండవచ్చని ఊహాగానాలు ఉన్నా అది మాటలో లేదా ప్రకటనలకో మాత్రమే పరిమితమవ్వడం ఖాయం. ఇక కొత్తగా ఎంట్రీ ఇస్తోన్న జనసేన సైతం కూటమికి తెరలేపే సూచనలు మెండుగా ఉన్నట్టు […]
టీటీడీ చైర్మన్ ఆ ఇద్దరిలో ఎవరికో..!
ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయమైన తిరుమల తిరుపతి వెంకన్న దేవస్థానం చైర్మన్ పదవి కోసం ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలామంది రాజకీయ నాయకులు అయితే ఈ పదవిని జీవితంలో ఒక్కసారైనా చేపట్టాలని ఎన్నో కలలు కంటుంటారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ నుంచి సీనియర్ ఎంపీలుగా ఉన్న నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ సైతం గత కొద్ది రోజులుగా ఈ పదవి చేపట్టేందుకు చేయని ప్రయత్నాలంటూ లేవు. రాయపాటి అయితే […]
రాములమ్మ చివరి చూపులు టీడీపీలోకా..!
వెటరన్ హీరోయిన్ విజయశాంతి ప్రస్తుతం పొలిటికల్ ఓ క్రాస్‌రోడ్‌లో ఉన్నారు. పలు పార్టీలు మారి తల్లి తెలంగాణ పార్టీ స్థాపించిన రాములమ్మ 2009 ఎన్నికల వేళ ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఆ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా పోటీ చేసి చచ్చీ చెడీ గెలిచారు. గత ఎన్నికలకు ముందు కేసీఆర్‌తో గ్యాప్ రావడంతో రాములమ్మ కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడంతో ఆ పార్టీలో చేరి మెదక్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలంగాణ డిప్యూటీ స్పీకర్ […]
పశ్చిమగోదావరి వైసీపీలో జగన్ బాంబు
2014 ఎన్నికలకు 2019 ఎన్నికలకు ఏపీ వైసీపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారతాయో ఊహకే అందడం లేదు. గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ జిల్లాలో ఖాతా తెరవలేదు. 15 ఎమ్మెల్యే స్థానాలతో పాటు 3 ఎంపీ సీట్లలోను ఓడిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీపై పైచెయ్యి సాధించేందుకు జగన్ గత ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లలో చాలామందిని పక్కన పెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ ఈ జిల్లా వరకు తీసుకునే నిర్ణయాలు వైసీపీలో పెద్ద […]
బాబు లిస్టులో ఆ ఇద్దరు మంత్రులకు లీస్ట్ ర్యాంకులు
ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన ఈ మూడేళ్లలో పలుసార్లు అటు మంత్రులకు, ఇటు ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇస్తూ వారి పనితీరు విషయాన్ని వారికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నారు. ఇక తాజాగా మంత్రివర్గ ప్రక్షాళన తర్వాత పాతవారిలో కొంతమందిని తప్పించి కొత్త వారికి చోటు కల్పించిన చంద్రబాబు ఈ ప్రక్షాళన తర్వాత ఓ ఇద్దరు మంత్రులపై నో ఇంట్రస్ట్ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారన్న చర్చలు ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఏపీలోని ఇద్దరు ఉపముఖ్యమంత్రుల్లో ఒకరైన కేఈ […]
