టీడీపీలో సెంట‌రాఫ్‌ది ఎట్రాక్ష‌న్ ఆ ఇద్ద‌రు నేత‌లేన‌ట‌!

ఏపీ అధికార పార్టీలో ఇద్ద‌రు నేత‌లు ఇప్పుడు సెంట‌రాఫ్‌ది ఎట్రాక్ష‌న్‌గా మారారు. రాష్ట్రంలో టీడీపీని అన్ని విధాలా ప‌రుగులు పెట్టించడంలో ఈ ఇద్ద‌రు నేత‌లు అత్యంత కీల‌కంగా ముంద‌డుగు వేస్తున్నార‌ట‌. దీంతో ఇప్పుడు అంద‌రి క‌ళ్లూ ఆ ఇద్ద‌రు నేత‌ల‌పైనే ఉన్నాయ‌ని టాక్ న‌డుస్తోంది. ఆ ఇద్ద‌రు ఎవ‌రో కాదు. ఒక‌రు టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావు కాగా మ‌రోక‌రు సీఎం చంద్ర‌బాబు ముద్దుల కుమారుడు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ లేన‌ట‌! ఈ […]

త‌మిళ రాజ‌కీయాల్లో మ‌రో ట్విస్ట్‌

మొన్న‌టి వ‌ర‌కూ ఎన్నో మ‌లుపులు తిరిగిన త‌మిళ రాజ‌కీయాలు కుదుట‌ప‌డుతున్నాయి. ఎలాంటి థిల్ల‌ర్ సినిమాలోలోని ట్విస్ట్‌లు అక్క‌డ ఉన్నాయంటే అతిశ‌యోక్తి కాదేమో! ఇప్పుడిప్పుడే స‌ద్దుమ‌ణుగుతున్న త‌మిళ రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌నం!! మాజీ సీఎం, దివంగ‌త జ‌య‌ల‌లిత‌కు కూతురినంటూ ఒక మ‌హిళ మీడియా ముందుకు రావ‌డంతో.. మ‌ళ్లీ త‌మిళ రాజ‌కీయాల్లో అల‌జ‌డి మొద‌లైంది. జ‌య‌ల‌లిత‌-ఎంజీఆర్‌ల బంధానికి ప్ర‌తీకగా వారికి కూతురు పుట్టింద‌ని, చిన్న‌త‌నంలోనే జ‌య నెచ్చెలి శశిక‌ళ వ‌ల్ల దూరమైపోయాన‌ని చెప్ప‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. త‌మిళ […]

చంద్ర‌బాబు సేఫ్ గేమ్‌లో విన్న‌ర్ వైసీపీనా?

మొత్తానికి టీడీపీపై వైసీపీ ఆధిప‌త్యం సంపాదించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఏడో స్థానం ఎవ‌రు గెలుస్తారో అనే ఉత్కంఠ‌కు తెర‌దించింది. ఏడు స్థానాల్లో ఐదింటిని టీడీపీ గెలుచుకున్నా.. మిగిలిన రెండు స్థానాల‌ను ద‌క్కించుకుంది. దీంతో త‌మ‌కు బ‌లం లేక‌పోయినా రెండో సీటును గెలుచుకుని.. టీడీపీపై పైచేయి సాధించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఏడుగురు అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు!! అయితే ఇందులో టీడీపీ అధిక స్థానాలు గెలుచుకున్నా.. నైతికంగా టీడీపీపై వైసీపీ విజ‌యం సాధించిన‌ట్ట‌యింది. ఎమ్మెల్యేల […]

వైసీపీ ఫైర్ బ్రాండ్‌ రోజాకి ఏమైంది..!

అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యే రోజా ఎప్పుడూ హైలైట్‌గా నిలుస్తారు!! గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ఆమె చేసిన గ‌లాటా ఎవ‌రూ మ‌రిచిపోయి ఉండ‌రు! కానీ కొత్త అసెంబ్లీలో ఆమె మ‌రింత కొత్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అస‌లు మాట్లాడ‌ట‌మే మానేశారు! ఎదురుదాడికి దిగ‌డంలేదు! ప‌క్క నుంచి సెటైర్లు వేయ‌డం లేదు! ర‌క‌రకాల హావ‌భావాలు ఆమె మోములో క‌నిపించ‌డం లేదు! తొలిరోజు అసెంబ్లీలో రోజా వెనక సీట్లో కూర్చోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎందుకీ వింత ప్ర‌వ‌ర్త‌న‌.. అంటే దీని వెనుక […]

వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు టీడీపీలో అసంతృప్తి సెగ‌లు రేపుతున్నాయి. ఎన్నో యేళ్ల నుంచి పార్టీని న‌మ్ముకుని ఉన్నాం… ఎన్నోసార్లు త్యాగాలు చేశాం…అయినా పార్టీ త‌మ‌కు న్యాయం చేయ‌లేద‌ని వారంతా మండిప‌డుతున్నారు. వారిలో కొంద‌రు త‌మ తీవ్ర అసంతృప్తిని ఓపెన్‌గానే వ్య‌క్త‌ప‌రిస్తే మ‌రికొంద‌రు మాత్రం పార్టీకే గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక సీనియ‌ర్ల‌లోను, ఆశావాహుల్లోను అసంతృప్తి సెగ‌లు రేపుతోంది. తాజాగా అసెంబ్లీ స‌మావేశాల వేళ డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణ‌మూర్తి త‌న […]

బాబు వద్ద అశోక్ ప్రాధాన్యం తగ్గుతోందా..!

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో టీడీపీకి కొత్త `క‌ళ‌` రాబోతోంద‌నే వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న, కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు.. ప్రాబ‌ల్యం ఈ `క‌ళ‌` ముందు చిన్న‌బోతోంద‌నే వార్త‌లు జోరందుకుంటున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా క‌ళా వెంక‌ట్రావు బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి జిల్లా రాజకీయ‌ల్లో మ‌రో ప‌వ‌ర్ హౌస్ త‌యారైంది. దీనికి తోడు పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ కూడా.. క‌ళా వెంక‌ట్రావుకు పూర్తి మ‌ద్ద‌తు ఇస్తుండ‌టంతో.. అశోక్‌కు […]

టీజేఏసీ లో లుకలుకలు…కేసీఆర్ ప్లాన్స్ సక్సెస్..!

ఇన్నాళ్లూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఐక్యంగా పోరాడిన.. టీజేఏసీలో విభేదాలు భగ్గుమన్నాయి! టీజేఏసీ చైర్మ‌న్ కోదండ‌రామ్‌పై జేఏసీ నేత‌లు లేఖాస్త్రం సంధించ‌డం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఐక్యంగా ఉన్న నేత‌లు ఒక్క‌సారిగా కోదండ‌రామ్‌పై ఎదురుదాడికి దిగ‌డం వెనుక పెద్ద వ్యూహ‌మే ఉంద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా సొంత పార్టీ దిశ‌గా కోదండ‌రామ్ అడుగులు వేస్తున్న వేళ‌.. టీజేఏసీలో లుక‌లుక‌లు దుమారాన్ని రేపుతున్నాయి. అయితే ఈ లుక‌లుక‌ల వెనుక సీఎం కేసీఆర్ చాతుర్యం ఉన్నట్లు స్ప‌ష్టంగా […]

అసెంబ్లీ సాక్షిగా బాలయ్య సంచలన ప్రకటన

నంద‌మూరి బాల‌కృష్ణ ఈ మ‌ధ్య సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ ప్ర‌జ‌ల‌ను, ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ తీస్తాన‌ని, అందులో తానే స్వ‌యంగా ఎన్టీఆర్ పాత్రలో క‌నిపించ‌బోతున్నాని చెప్పి.. ఒక్క‌సారిగా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. ఇప్పుడు నూతన అసెంబ్లీ వేదిక‌గా మారో సంచ‌ల‌నానికి నాంది ప‌లికాడు బాల‌య్య!! సినిమా ప‌రిశ్ర‌మ‌ను అమ‌రావ‌తికి తీసుకొచ్చేస్తామ‌ని చెప్పి.. అటు సినీ వ‌ర్గాలు ఖంగు తినేలా చేశాడు. అయితే విశాఖకు సినీ ప‌రిశ్ర‌మ త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క అడుగు […]

జయ మృతిపై ఎయిమ్స్ రిపోర్టు లో ఏముంది…

`అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం జ‌య‌లలిత మృతిపై అనుమానాలున్నాయి. ఆమెకు ఎలాంటి చికిత్స అందించారో బ‌య‌ట‌కు వెల్ల‌డించాలి` రెండు నెల‌లుగా త‌మిళ‌నాట ఈ మాట‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. జ‌య మ‌ర‌ణంపై సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని డిమాండ్ చేస్తూ.. నిరాహార దీక్ష‌కు దిగుతున్నారు. మ‌రోప‌క్క ప్ర‌జల్లోనూ ఏమూల‌నో `అమ్మ‌` మృతిపై సందేహాలు వినిపిస్తున్న త‌రుణంలో.. ఎయిమ్స్ షాకింగ్ రిపోర్టు ఇచ్చింది. అమ్మ మృతికి సంబంధించిన వివ‌రాలు, ఆమెకు అందించిన చికిత్స వివ‌రాలు వెల్ల‌డించింది. జ‌య మ‌ర‌ణంపై స‌స్పెన్స్‌కు తెర‌దించేందుకు […]