అసెంబ్లీలో టీడీపీ సెల్ఫ్ డిఫెన్స్‌

ఏపీ అసెంబ్లీలో స‌భ్యుల మ‌ధ్య వింత ధోర‌ణి క‌నిపిస్తోంది. ఇది వ‌ర‌కు జ‌రిగిన స‌మావేశాల్లో స‌భ్యుల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు మాత్ర‌మే ఉండేవి. కానీ ఇప్పుడు స‌వాళ్లు, రాజీనామాల వ‌రకూ విష‌యం వెళ్లింది. అగ్రిగోల్డ్, స్పీక‌ర్ కోడెల వ్యాఖ్య‌ల‌పై జ‌రిగిన చ‌ర్చ ఆసాంతం వాడివేడిగా జ‌రిగింది. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య స‌వాళ్లు తారస్థాయికి చేరాయి. ఈ విష‌యంలో జ‌గ‌న్ కొంత పై చేయి సాధించగా.. టీడీపీ మాత్రం కొంత అభ‌ద్ర‌తా భావ‌నికి లోనైందని […]

కోడెల‌ మ‌ధ్య‌లో అసెంబ్లీ `సాక్షి`గా టార్గెట్ ..దీని వెనుక వ్యూహం ఏంటి ?

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు చెందిన మీడియా సంస్థ‌ల‌పై టీడీపీ త‌న అధికార దండాన్ని ప్ర‌యోగిస్తోంది. ముఖ్యంగా `సాక్షి`ని టార్గెట్ చేస్తూ.. శాస‌న‌స‌భ‌లో మంత్రులు చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు నిద‌ర్శనంగా కనిపిస్తున్నాయి! మ‌హిళా పార్ల‌మెంటు జ‌రుగుతున్న స‌మ‌యంలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌ల‌ను వక్రీక‌రించార‌ని, ఇందుకు సాక్షి మీడియాపై చ‌ర్చ‌లు తీసుకోవాల‌ని మంత్రుల అసెంబ్లీలో సూచించారు. అయితే ఎప్పుడో జ‌రిగిన విష‌యాన్ని తెర‌పైకి తీసుకురావ‌డం వెనుక కూడా అస‌లు వ్యూహం వేరే ఉంద‌ని తెలుస్తోంది. ఇందులో కోడెలను […]

జగన్ తప్పుడు నిర్ణయం… అక్కడ టీడీపీ గెలుపు పక్క అంటున్న వైసీపీ క్యాడర్

నంధ్యాల ఉప ఎన్నిక‌లో పోటీచేయాల‌ని పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ తీసుకున్న‌ నిర్ణ‌యంతో వైసీపీ నేత‌లు అయోమ‌యంలో ప‌డిపోతున్నారు. పైకి చెప్ప‌లేక పోయినా.. లోలోప‌లే తీవ్ర మ‌థ‌న ప‌డుతున్నారు. అంతేగాక ఉన్న కాస్తో కూస్తో క్యాడ‌ర్ కూడా టీడీపీ వైపు వెళ్లిపోవ‌చ్చ‌నే అనుమానాలు వ్య‌క్తంచేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక పార్టీకి లాభించ‌క పోగా… న‌ష్టం క‌లిగించ‌వ‌చ్చని ఆందోళ‌న చెందుతున్నారు. సానుభూతి ప‌వ‌నాలు వీస్తున్న వేళ‌, టీడీపీ గురించి కాక‌పోయినా త‌మ నాయ‌కుడి కుటుంబానికి వ్య‌తిరేకంగా ఎలా ప్ర‌చారం […]

కేసీఆర్-ప‌రిపూర్ణానంద భేటీ వెనుక‌ వ్యూహం ఇదే.. 

తన వ్యూహాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేస్తూ.. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త వ్య‌క్తిని చూపిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్! భ‌విష్య‌త్తులో చేప‌ట్టబోయే కార్య‌క్ర‌మాల‌కు అడ్డంకులు క‌ల‌గ‌కుండా ఆయ‌న నిర్ణ‌యాలు తీసుకుంటారు. అంత అడ్వాన్స్‌గా ప‌రిణామాల‌ను ఊహిస్తారు క‌నుక ప్ర‌త్య‌ర్థుల‌కు అంద‌కుండా ఎదిగిపోయారు. ఇప్పుడు ఆయ‌న ప‌రిపూర్ణానంద స్వామిని అక‌స్మాత్తుగా కల‌వడం అంద‌రినీ విస్తుగొలుపుతోంది! సాధార‌ణంగానే ఆధ్యాత్మిక భావం ఎక్కువగా ఉన్న కేసీఆర్ స్వ‌యంగా ప‌రిపూర్ణానంద‌ను క‌ల‌వ‌డం వెనుక రాజ‌కీయ కోణం కూడా ఉంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం! ఇటీవ‌లే.. దూకుడు పెంచిన […]

బీజేపీని తొక్కేసేందుకు బాబు కొత్త వ్యూహం!

ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా ఉన్నా.. వాటిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునే నేత‌ల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు ముందు వ‌రుస‌లో ఉంటారు. టీడీపీ-బీజేపీ కూటమి విష‌యంలో చంద్ర‌బాబు వేస్తున్న అడుగులు చూస్తే.. ఇది నిజ‌మ‌నిపించ‌క మాన‌దు! బీజేపీకి టీడీపీతో ఉన్న అవ‌స‌రం కంటే.. టీడీపీకి-బీజేపీతో ఉన్న అవ‌స‌ర‌మే ఎక్కువ‌! కానీ చంద్ర‌బాబు మాత్రం బీజేపీ మాత్రం టీడీపీపై ఆధార‌ప‌డ‌క త‌ప్ప‌ని స‌రి అనేంత‌గా ప‌రిస్థితుల‌ను మార్చేస్తున్నారు! అందుకు ఇటీవ‌ల విడుద‌లైన ప‌ట్ట‌భ‌ద్రుల‌, ఉపాధ్యాయ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం.. ఆయ‌న చేసిన […]

బాబుపై రాజీనామా అస్త్రం ఎక్కుపెట్టిన జ‌గ‌న్‌

ప్ర‌త్యేక‌హోదాపై వెన‌క‌డుగు వేసేది లేదంటున్నారు ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి! ఆరునూరైనా త‌మ ఎంపీలు రాజీనామా చేసి తీర‌తార‌ని స్ప‌ష్టంచేస్తున్నారు. హోదాపై మాట‌మార్చిన బీజేపీ, టీడీపీల‌ను ఇరుకున పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు! కేంద్రంతో గొడ‌వ ప‌డేదానికంటే.. రాజీమార్గ‌మే బెట‌ర్ అని సీఎం చంద్ర‌బాబు చెబుతుంటే.. రాజీ కంటే పోరాట‌మే బెట‌ర్ అని జ‌గ‌న్ చెబుతున్నారు. మొత్తానికి త‌మ పార్టీ నేత‌లు రాజీనామా చేస్తార‌ని చెప్పి.. ప్ర‌త్యేక‌హోదా కోసం పోరాడింది తామేన‌ని, టీడీపీ అస‌లు చేసిందేమీ లేద‌ని ప్ర‌జల ముందు […]

టీఆర్ఎస్ ఎంపీకి కేసీఆర్ షాక్‌ … నిరాశలో గుత్తా

ఎన్నో ఆశ‌ల‌తో సొంత పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన నేత‌ల‌కు వ‌రుస‌గా షాక్‌లు త‌గులుతున్నాయి. ఏదో ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని.. గులాబీ కండువా క‌ప్పుకున్న నాయ‌కుల‌కు.. చివ‌రికి నిరాశే ఎదుర‌వుతోంది! ఇప్ప‌టికే కారులో ఇమ‌డ‌లేక‌.. సొంత గూటికి వెళ్ల‌లేక ఇలాంటి నాయ‌కులంతా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇప్పుడు ఇదే జాబితాలో మ‌రో ఎంపీ కూడా చేరిపోయారు. మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఆయ‌న పెట్టుకున్న ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి! దీంతో ఆయ‌న తీవ్రంగా మ‌థ‌న‌ప‌డుతున్నారని స‌మాచారం! మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని వ‌చ్చిన ఆయ‌న‌కు […]

బీజేపీని నట్టేట ముంచిన సూపర్ స్టార్‌

దక్షిణాదిలో ఎలాగైనా పాగా వేయాల‌ని, దీనికి త‌మిళ‌నాడు నుంచే ప్రారంభించాల‌ని ఆశ పెట్టుకున్న‌బీజేపీకి ఎదురుదెబ్బ త‌గిలింది. మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఎలాగైనా త‌మిళ‌నాడుపై ప‌ట్టు సాధించాల‌ని చూస్తున్న కాషాయ ద‌ళానికి షాక్ ఎదురైంది. ఆర్ కే న‌గ‌ర్‌లో ఎలాగైనా బ‌లం లేక‌పోయినా, సూప‌ర్ స్టార్ ఇమేజ్‌తో నెట్టుకురావాల‌ని చూస్తున్న బీజేపీ నేత‌ల ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి! చివ‌రికి సూపర్ స్టార్ ర‌జనీకాంత్ కూడా బీజేపీకి షాక్ ఇచ్చాడు. తాను ఎవ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌న‌ని స్ప‌ష్టంచేశాడు. దీంతో […]

కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు బాబు ముహూర్తం ఖ‌రారు … ప్ర‌కంప‌న‌లు రేప‌డం ఖాయం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ ప్ర‌క్షాళ‌న వార్త‌లు గ‌త యేడాదిన్న‌ర‌గా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు త‌న కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు బాబు ముహూర్తం ఖ‌రారు చేశారు. ఉగాది, శాస‌న‌స‌భ, మండ‌లి స‌మావేశాలు ముగిశాక ఏప్రిల్ 6వ తేదీన కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని తెలుస్తోంది. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ఐదుగురు మంత్రుల‌కు ఖచ్చితంగా ఊస్టింగ్ త‌ప్ప‌ద‌న్న టాక్ ఏపీ టీడీపీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ  అవుట్ లిస్టులో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన పీత‌ల సుజాత‌, విజ‌య‌న‌గ‌రం […]