2019 ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు గానీ.. నేతలు మాత్రం ఆ పార్టీలో చేరాలని ఉవ్విళ్లూ రుతున్నారు. ఎప్పుడెప్పుడు జనసేనాని `ఊ` అంటారా.. ఎప్పుడెప్పుడు పార్టీలోకి చేరిపోదామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సామాజికవర్గం బలంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు నేతలంతా పవన్ సరసన చేరేందుకు సిద్ధమైపోయారట. జిల్లాలో పవన్ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్న నేతలు ప్రయత్నాలను ఇప్పటినుంచే మొదలు పెట్టారు. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ […]
Category: Latest News
బాబుపై బురద జల్లే యత్నాలకు ఇదిగో సాక్ష్యం
మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి బుదర జల్లే ప్రయత్నం! ప్రభుత్వాన్ని, చంద్రబాబును ప్రజల్లో చులకన చేసే దుష్ప్రచారానికి తెగడబడుతూనే ఉంది `సాక్షి` మీడియా! ఆయన చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెబుతూ.. రంధ్రాన్వేషణ చేస్తూ.. నిరంతరం, ప్రతిక్షణం తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. పదాలకు కొత్త అర్థాలు చెబుతూ.. మాటలకు కొత్త భాష్యాలు వెతుకుతూ.. ప్రజల్లో ఆయన్ను మరింత దిగజార్చాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ సన్మాన సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి […]
చంద్రబాబు విందు చాలా కాస్ట్లీ గురూ..!
నిధుల లేమితో ఖజానా కటకటలాడుతోంది! అయినా.. ఆయన ఖర్చులు మాత్రం తగ్గడం లేదు!! ఆర్థిక పరిస్థితి మాటల్లో వర్ణించలేనంత దారుణంగా ఉంది! అయినా.. ఆయన విదేశీ పర్యటలనకు వెళ్లడం మానలేదు!! లోటు బడ్జెట్ మరో పక్క వెక్కిరిస్తోంది! అయినా.. అయన చేతికి ఎముకే లేదు!! అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపనలు, విదేశీ టూర్లు, కళ్లు చెదిరే రీతిలో హంగులు, ఆర్భాటాలు.. స్వల్పంగా చెప్పాలంటే ఇదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి! ఇప్పుడు మరోసారి తానెంత […]
వైసీపీలో చేరేందుకు ఆ టీడీపీ ఎమ్మెల్యే రంగం సిద్ధం!
ఏపీ మాజీ మంత్రి తీరు టీడీపీ నేతలకు అంతుచిక్కడం లేదు. ఒకపక్క టీడీలోనే కొనసాగుతూ.. మరోపక్క ప్రతిపక్ష నేతలతో `టచ్`లో ఉంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నారట. అయితే ఆయన మాత్రం పక్కా ప్రణాళికతోనే ముందకు వెళుతున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రావెల కిషోర్‌బాబు మంత్రి పదవి ఊడబీకేసిన విషయం తెలిసిందే! ప్రస్తుతం ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్టు ఇవ్వకపోవచ్చనే స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. వీటిని పసిగట్టిన ఆయన.. ఇక వైసీపీలో చేరేందుకు అన్ని అస్త్రాలు […]
రోజాపై టీడీపీ అభ్యర్థిగా రాజు గారేనా..!
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై నిరంతరం తీవ్ర విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజా! నగరి ఎమ్మెల్యేగా ఉన్న ఆమెపై.. 2019 ఎన్నికల్లో పోటీచేసేందుకు టీడీపీ తరఫున అభ్యర్థి కోసం సీఎం చంద్రబాబు ఇప్పటి నుంచే అభ్యర్థుల వేటలో పడ్డారు. గతంలో ఆమెపై పోటీచేసిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు పోటీ నుంచి విరమించుకోవడంతో ఇప్పుడు కొత్త అభ్యర్థి ఎవరా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నగరి నుంచి పోటీచేయడానికి `రాజు`గారు […]
బాబు సర్కారుకి జగన్ మద్దతు..?
ఏపీలో విపక్షంగా వ్యవహరించి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీ నేత జగన్.. ఇప్పుడు కొన్ని రోజులుగా అంటే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక జరిగిన తర్వాత నుంచి జగన్ కంఠం మూగపోయింది. ఏపీలో ప్రజలు ఉన్నారని, వారు ప్రస్తుతం వివిధ సమస్యల్లో చిక్కుకుపోయారని కూడా ఆయన గుర్తించలేకపోతున్నారు. ముఖ్యంగా గడిచిన వారంలో రాష్ట్రం రెండు ప్రధాన సమస్యలు ఎదుర్కొంది. తూర్పుగోదావరి జిల్లా చాపరాయిలో మరణాలు, పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో దళితుల బహిష్కరణ. ఈ రెండు సంఘటనలు పెద్ద ఎత్తున […]
రేవంత్ స్టాండ్ మార్చుకున్నాడా?
తెలంగాణ టీడీపీ నేతల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి రూటు మారుతోందా? పొలిటికల్‌గా ఆయన స్టాండ్ ఏమిటి? వంటి పలు అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం ఇటీవల ఆయన వ్యవహరించిన తీరే! టీఆర్ ఎస్‌పై రేవంత్ ఎలా రెచ్చిపోతాడో అందరికీ తెలిసిందే. అంతేకాదు, ఆట మొదలైంది అంటూ.. అప్పట్లో ఓటుకు నోటు కేసులో జైలు నుంచి వచ్చాక చేసిన సవాలు కూడా అందరికీ గుర్తింది. అయితే, అనూహ్యంగా ఆయన తీరు మారిపోయింది. ఒక్కసారిగా […]
ఆ రెండు విషయాలతోనే బాబు ఫైట్!!
ఏపీ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు కంటిపై కునుకులేకుండా పోతోందట. ఫుల్లు ఏసీలోనూ ముచ్చెమటలు పడుతున్నాయట! దీనికి కారణం.. ఓ రెండు విషయాలని అధికారులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి సీఎం సీటును పదిలం చేసుకోవాలని భావిస్తున్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధానంగా రెండు విషయాలను ఎంచుకున్నారు. ఎక్కడ ఏ సభలో మాట్లాడినా ఆరెండు విషయాలు చెప్పకుండా ఆయన ఉండలేకపోతున్నారు. దీంతో ఆ రెండు విషయాలే ఇప్పుడు ఆయనకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయట. ఇంతకీ […]
కమ్యూనిస్టులకు పవన్ దెబ్బేశాడుగా!
తనకు కమ్యూనిస్టులంటే గౌరవం ఉందని, వాళ్ల భావజాలం.. తన భావజాలంలో సారూప్యత ఉందని.. అవసరమైతే వాళ్లతో కలిసి పనిచేసేందుకైనా సిద్ధమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంకేతాలు ఇస్తూ వస్తున్నాడు. దీంతో కమ్యూనిస్టులు కూడా పవన్ తమతో దోస్తీకడతాడని ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే వారికి పవన్.. కూడా హ్యాండ్ ఇచ్చాడు. ప్రభుత్వ వైఫల్యాలు, విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, ఇందుకు పవన్ కూడా తోడయితే తమకు మైలేజ్ వస్తుందని భావించిన కమ్యూనిస్టుల ఆశలు గల్లంతయ్యాయి. […]