క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జ‌గ‌న్!

కంటికి క‌నిపించ‌కుండా ప్ర‌జ‌ల‌ను నానా తంటాలు పెడుతున్న క‌రోనా వైర‌స్‌.. మ‌ళ్లీ విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కేసులు వెయ్యికి పైగా న‌మోదు అవుతున్నాయి. మ‌రోవైపు వ్యాక్సినేష‌న్ క్యార్య‌క్ర‌మం కూడా జోరుగానే జ‌రుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ఈ రోజు గుంటూరులో భారతపేట 140వ వార్డు సచివాలయంలో క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. సతీమణి భారతితో కలిసిన వెళ్లిన ఆయనకు అక్కడి వైద్యులు వ్యాక్సిన్ వేశారు. అనంతరం సీఎం సతీమణి వైఎస్ […]

ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేసిన బాల‌య్య‌..ఎందుకోస‌మంటే?

వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా సెల్వమణికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఫోన్ చేశారు. ఎందుకూ.. ఏమిటీ.. అన్న వివ‌రాలు తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఇటీవ‌ల రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినీ ప్ర‌ముఖులు ఆమెను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే బాలకృష్ణ కూడా రోజా కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. […]

సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పి ల‌హ‌రికి క‌రోనా పాజిటివ్‌..!

బాలీవుడ్‌లో క‌రోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతుండ‌డంతో చాలా మంది సెలబ్రిటీస్ క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పి ల‌హ‌రి కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న‌తో కాంటాక్ట్ ఉన్న వాళ్లంద‌రు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని బ‌ప్పి ల‌హ‌రి మేనేజ‌ర్ తెలిపారు. ఆయ‌న క్షేమం కోరుకునే వారంద‌రికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేస్తున్నాం అని స్పోక్స్ ప‌ర్స‌న్ అన్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ నటుడు […]

పాత బ్రిడ్జి కూలి ఒక వ్యక్తి మృతి..!

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. జిల్లాలోని వాంకిడిలో పాత వంతెన కూలిపోవడంతో ఒక వ్యక్తి అక్కడిక్కడే చనిపోయాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వాంకిడిలో ఉన్న పాత బ్రిడ్జిని అక్కడ కార్మికులు నిన్న సగం కూల్చి వేశారు. కాగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ కేబుల్‌ పనుల కోసం ఇద్దరు సిబ్బంది వంతెన పై పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ ఉన్న ఇద్దరు కార్మికులు శిథిలాల్లో చిక్కుకు పోయారు. […]

స్టార్ హీరోతో నయనతార సహజీవనం ..?

ఇంకొద్ది రోజుల‌లో పోలింగ్ జ‌ర‌గ‌నున్న క్రమంలో త‌మిళ‌నాడులో ప్ర‌చారం జోరుగా సాగుతుంది. ఒక‌రి పై ఒక‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా రాధా ర‌వి త‌న పార్టీ ప్ర‌చారంలో భాగంగా న‌య‌న‌తార‌ను లాగారు. న‌య‌న‌తార, డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు హీరో ఉదయనిధి స్టాలిన్ తో సహ‌జీవ‌నం చేస్తుంద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు ఆయన. ఇది వరకు కూడా ఆయ‌న న‌య‌న‌తార ‌పై కొన్ని కామెంట్స్ చేశారు. శ్రీరామరాజ్యం చిత్రంలో నయనతార సీత పాత్రలో నటించింది. అలాంటి వాళ్లు […]

ప్రేక్షకులకు వార్నింగ్ ఇచ్చిన సౌత్ బ్యూటీ..!!

తమిళ స్టార్ హీరో కార్తీ ఏప్రిల్ 2న సుల్తాన్ మూవీతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. రెమో మూవీతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులనీ మెప్పించిన యువ దర్శకుడు బక్కియరాజ్‌ కణ్ణన్‌ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. లక్కీ భామ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. […]

వాక్సిన్ తీసుకున్న గంగ‌వ్వ‌..నొప్పితో కేకలు.!

బిగ్ బాస్ సీజ‌న్ 4 షోలో గంగ‌వ్వ అతి త‌క్కువ టైంలోనే ఎంతో మంది ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ కార్య‌క్ర‌మంతో ఆమె పాపులార్ కాగా, బిగ్ బాస్ షోతో మ‌రింత ఆద‌ర‌ణ పొందింది. ఇటీవలే వైల్డ్ డాగ్ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా నాగార్జున‌తో క‌లిసి ఫుల్ సందడి చేసింది గంగ‌వ్వ‌. ప్ర‌స్తుతం దేశ‌మంత‌టా క‌రోనా సెకండ్ వేవ్ ఉన్న క్రమంలో గంగ‌వ్వ క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో […]

రెండు రికార్డులు సొంతం చేసుకున్న సాయిపల్లవి !

నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్ గా నటిస్తున్న లవ్ స్టోరీ చిత్రం ఈ నెల 16న రిలీజ్ కాబోతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా కొత్త రికార్డు సాధించింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీలోని సారంగ దరియా లిరికల్ వీడియో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. తెలుగు సినిమాలో అత్యంత త్వరగా వంద మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న లిరికల్ వీడియోగా సారంగ దరియా రికార్డు సాధించింది. వంద మిలియన్ వ్యూస్ ను సౌత్ […]

అల‌ర్డ్ అంటున్న‌ `ఆర్ఆర్ఆర్` యూనిట్..ఆలోచ‌న‌లో ప‌డ్డ ఫ్యాన్స్‌!‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుథిరం)‌`. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచేయ‌గా.. చిత్ర యూనిట్ […]