మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన సినీ నటుడు కమల్ హాసన్.. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి తొలిసారి తన అదృష్టాన్ని పరిక్షించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో కమల్‌ను తమిళులు ఊహించని దెబ్బ కొట్టారు. కమల్‌తో సహా పార్టీ అభ్యర్థులు తమిళనాడులో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కమల్ హాసన్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఓటమి […]
Category: Latest News
రోడ్డు ప్రమాదంలో సీఐ దంపతులు మృతి
రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అశ్రద్ధ, అజాగ్రత్తతో నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. అవి కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మేట్ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఓ లారీని స్విఫ్ట్ కారు ఢీకొనగా ఈ ప్రమాదంలో కారులో సుల్తాన్ బజార్ సీఐ లక్ష్మణ్, ఆయన సతీమణి ఝాన్సీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా […]
పెళ్లికి రెడీ అయిన ఛార్మీ..వరుడు అతడేనట?
ఛార్మీ కౌర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మీ ప్రస్తుతం ఎలాంటి చిత్రాలు చేయకపోయినా నిర్మాతగా మాత్రం దూసుకుపోతోంది. అది కూడా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మించే చిత్రాలన్నీ ఛార్మీనే నిర్మిస్తోంది. అలాగే పూరీ టూరింగ్‌టాకీస్, పూరీ కనెక్ట్స్ ల నిర్వహణ, నిర్మాణ బాధ్యతలన్నీంటిని ఛార్మి చూసుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఛార్మీ పెళ్లి వార్తలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లిపై తనకు […]
`వకీల్ సాబ్`గా మారిన స్టార్ హీరో సూర్య..ఫొటోలు వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నల్ల కోటు ధరించి వకీల్ సాబ్‌గా పవన్ అదరగొట్టేశాడు. అయితే ఇప్పుడు పవన్ మాదిరిగానే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా వకీల్ సాబ్‌గా మారాడు. ప్రస్తుతం సూర్య టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో మొదటి […]
కరోనా బారిన అండర్‌వరల్డ్ డాన్.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు..!
ముంబాయి బాంబు పేలుళ్లు అనగానే గుర్తుకు వచ్చే పేరు దావూద్ ఇబ్రహీం. అతని ప్రధాన అనుచరుడు చోట రాజన్. వారిద్దరి పేర్లు అందరికీ తెలిసిందే. దావూద్‌తో విబేధాల కారణంగా మరో గ్యాంగ్‌ను ఏర్పాటు చేయగా, రాజన్‌పై దాదాపు 70కిపైగా క్రిమినల్ కేసులున్నాయి. ఇక దావూద్ దేశం విడిచి పారిపోగా, చోటారాజన్‌ను గతంలో పోలీసులు అరెస్టు చేయగా తీహార్ జైలులో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కరోనాతో మరణించాడంటూ మీడియాలో […]
ఎయిర్ పోర్ట్ భారీగా బంగారం పట్టివేత.. విలువెంతంటే..!
అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. కేటుగాళ్లు రోజుకో తీరుగా రూటు మార్చి బంగారాన్ని దేశంలోకి తీసుకొస్తున్నారు. కొందరు పేస్గ్ రూపంలో తీసుకొస్తుంటే, మరికొందరు ప్రైవట్ శరీరభాగాల్లో కూడా పెట్టుకుని స్మగ్లింగ్ చేసేందుకు యత్నిస్తున్నారు. ఇటీవల ఒకరు ఏకంగా గ్లైండర్‌లో బంగారాన్ని పెట్టుకుని తరలించేందుకు యత్నించి కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. ఆ సంఘటన మరువక ముందే మరోసంఘటన వెలుగుచూసింది. భారీ మొత్తంలో బంగారం బయటపడింది. వివరాల్లోకి వెళ్లితే.. శంషాబాద్ ఎయిర్ […]
అప్పుకట్టాలంటే కోర్టుకెక్కాడు.. 10వేల జరిమానా కట్టాడు..
ఇప్పటికే కోర్టుల్లో లక్షలాది సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏళ్ల తరబడి కక్షిదారులు కోర్టుల చుట్టు తిరుగుతున్నారు. ఆ కేసులను పరిష్కరించేందుకు న్యాయమూర్తులు నానా అవస్థలు పడుతున్నారు. అనేక మార్గాల ద్వారా వాటిని పరిష్కరించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. మరోవైపు మరికొందరు మాత్రం కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారు. అనవసరమైన వ్యాజ్యాలు దాఖలు చేస్తూ కోర్టుకు కొత్త చిక్కులు పెడుతున్నారు. ఇలాగే నిరర్ధక వ్యాజ్యం వేసి కోర్టు సమయాన్ని వృధా చేసిన పిటిషనర్‌కు హైకోర్టు రూ.10 వేలు […]
ఈటల భూకబ్జాలో కొత్త ట్విస్ట్.. హైకోర్టుకు రైతులు!
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉదంతంలో వెలుగులోకి వచ్చి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజల్ గ్రామ భూముల వివాదంలోకొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భూముల సర్వేను అడ్డుకోవాలని వారు డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. మాజీమంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జాతో వెలుగులోకి వచ్చిన అనంతరం ప్రభుత్వం దేవరయాంజల్ భూములపై దృష్టి సారించింది. నలుగురు ఐఏఎస్‌లతో ప్రత్యేక […]









