`ఉప్పెన` హీరోకు క‌రోనా క‌ష్టాలు..ఓటీటీలో రెండో చిత్రం?!

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న వైష్ణ‌వ్ త‌న రెండో చిత్రాన్ని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేశాడు. ఉప్పెన విడుద‌ల‌కు ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన పాపులర్ నవల కొండపోలం ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రానికి కొండ‌పొలం అనే […]

భార్య‌ను చంపి.. ఆపై సెల్ఫీ దిగిన భ‌ర్త‌..!

అనుమానం పెనుభూతం. ప‌చ్చ‌ని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న‌ది. భార్య‌భ‌ర్త‌లను శ‌త్రువులుగా మార్చుతున్న‌ది. ఇది హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌ల‌కు దారి తీస్తున్న‌ది. అందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. పెళ్లియిన ఏడునెల‌ల‌కే క‌ట్టుకున్న భార్య‌ను క‌త్తితో పొడిచి చంపాడు ఓ క‌సాయి. ఈ సంఘ‌ట‌న ఏపీలో వెలుగుచూసింది. అధికారులు, స్థానికులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. క‌డ‌ప జిల్లా బద్వేలు పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన హ‌రి, మంజుల (23) దంప‌తులు. వారిరువురికి ఏడు నెల‌ల క్రిత‌మే వివాహామైంది. ఇదిలా ఉండ‌గా […]

డి – కంపెనీ: 4 నిమిషాల వీడియోతో అంచ‌నాలు పెంచేసిన వ‌ర్మ‌!

ఒక‌ప్ప‌టి టాలీవుడ్‌ స్టార్ డైరెక్ట‌ర్‌, వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం తీస్తున్న చిత్రాల్లో డి-కంపెనీ ఒక‌టి. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్ దావూద్‌ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని వ‌ర్మ తెర‌కెక్కించాడు. ముంబయిలోని ఓ చిన్న గ్యాంగ్‌ లీడర్‌.. పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడో ఈ చిత్రంలో చూపించ‌నున్నారు. అష్వత్‌ కాంత్, ఇర్రా మోహన్, రుద్రకాంత్‌, నైనా గంగూలి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ చిత్రం మే 15న స్పార్క్‌ […]

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న ర‌కుల్‌..గుట్టు విప్పేసిన మంచు ల‌క్ష్మి!

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేరటం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ర‌కుల్‌.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న‌ రకుల్ త్వ‌ర‌లోనే పెళ్లీ పీట‌లెక్క‌బోతోంద‌ట‌. ఈ విష‌యాన్ని ర‌కుల్ బెస్ట్ ఫ్రెండ్ మంచు ల‌క్ష్మీనే బ‌య‌ట పెట్టింది. తాజాగా వీరిద్ద‌రూ రానా ద‌గ్గుబాటి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌నెంబర్ వన్ యారీ షోలో రచ్చ చేశారు. […]

కోవిడ్ ను ఎదుర్కోనేంద‌కు కేంద్రం కొత్త కార్యక్రమం

దేశంలో కోవిడ్-19 సంక్రమణ సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో భాగంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిరూపిత ఆయుర్వేద మూలికా ఔషధం ఆయుష్64, సిద్ధ ఔషధం కబసురా కుడినీర్లను పంపిణీ చేయడానికి దేశవ్యాప్తంగా భారీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆసుపత్రుల్లో లేని కోవిడ్ రోగులకు వాటిని అందివ్వ‌నున్నారు. ఆ రెండు మందులు సమర్థ‌వంతంగా పనిచేస్తాయని మల్టీ-సెంటర్ క్లినికల్ ట్రయల్స్ లో రుజువయింది కూడా. ఆయూష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వివిధ సంస్థల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని, దశలవారీగా పంపిణీకి సమగ్ర […]

క‌రోనా సాకుతో పెళ్లికి నిరాక‌ర‌ణ‌..! తీరా క‌ట్ చేస్తే..

ఇప్పుడు దేనికైనా క‌రోనా మ‌హ‌మ్మారిని అడ్డుగా పెట్టుకోవ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. తాజాగా వెలుగుచూసిన సంఘ‌ట‌న అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది. మ‌రికొద్ది క్ష‌ణాల్లో జ‌ర‌గాల్సిన పెళ్లి ఆగ‌డ‌మే కాకుండా అది ఠాణాకు చేరుకుంది. తీరా అధికారులు విచారించ‌గా ఒక్కో విష‌యం బ‌య‌ట‌ప‌డుతున్న‌ది. వివ‌రాల్లోకి వెళ్లితే.. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఓ అబ్బాయి ముదిగుబ్బ కు చెందిన ఓ అమ్మాయితో వివాహం జరిపించేందుకు పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. అనుకున్న ప్ర‌కారం వ‌ధూవ‌రులు కదిరికి చేరుకోగా పెళ్లి తంతు కొన‌సాగిస్తున్నారు […]

క‌రోనా టైమ్‌లో రిస్క్ చేస్తున్న ప్ర‌భాస్‌..ఆందోళ‌నలో ఫ్యాన్స్‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో నిర్మిత‌మ‌వుతోంది. రామాయణ మహాకావ్యం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇక రావణాసుడి పాత్ర బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో స్టార్ట్ కాగా.. అక్క‌డే రెండో షెడ్యూల్ కూడా ముగిసింది. […]

క‌రోనాతో భార్య‌.. బ్లేడ్‌తో కోసి హ‌త‌మార్చిన భ‌ర్త‌

క‌రోనా సృష్టిస్తున్న విల‌యం అంతా ఇంతా కాదు. ఒక‌వైపు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌కుండా ప్రాణాల‌ను తీస్తుండ‌గా, మ‌రోవైపు మ‌రెన్నో దారుణ సంఘ‌ట‌నల‌కు కార‌ణ‌మ‌వుతున్న‌ది. కుటుంబ బంధాల‌ను చిద్రం చేస్తున్న‌ది. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. క‌రోనా బారిన ప‌డిన భార్య‌ను ఆమె భ‌ర్త దారుణంగా హ‌త్య చేశాడు. ఈ విషాద‌క‌ర సంఘ‌ట‌న నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. అధికారులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. నెల్లూరు జిల్లా కావలి పట్టణం సంక్లవారి తోట పరిధిలోని గోరింకపాలెం వీధికి చెందిన మల్యాద్రి, […]

త‌మిళుల దెబ్బ‌కు కమల్ కీల‌క నిర్ణ‌యం..?!

మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌.. ఇటీవ‌ల జ‌రిగిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికల బ‌రిలో దిగి తొలిసారి త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌ల్లో కమల్‌ను త‌మిళులు ఊహించ‌ని దెబ్బ కొట్టారు. క‌మ‌ల్‌తో స‌హా పార్టీ అభ్య‌ర్థులు త‌మిళ‌నాడులో ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేక‌పోయారు. ఈ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కమల్ హాసన్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఓటమి […]